ఆ ఒప్పందం చట్టవిరుద్ధం.. షక్సాగామ్‌ వ్యాలీ భారత్ లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించిన భారత్ 

Spread the love

వివాదాస్పద షక్సాగామ్‌ వ్యాలీకి సంబంధించి చైనా చేసిన ఆరోపణలను భారత్‌ గట్టి జవాబిచ్చింది.  1963లో పాకిస్థాన్‌, చైనా మధ్య కుదిరిన బోర్డర్ అగ్రిమెంట్ చట్ట విరుద్ధమని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో జరిగే కార్యకలాపాలను భారత్‌ గుర్తించబోదని పేర్కొన్నారు. షక్సాగామ్ వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఇటీవల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్-చైనా పేర్కొంటున్న 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేం ఎప్పటికీ గుర్తించబోమని  దీనిపై మా నిర్ణయంపై మారదు. షక్సాగామ్ వ్యాలీ మన దేశంలో భాగమేనని భారత్ స్పష్టం చేసింది. పాక్‌-చైనా ఎకనామిక్ కారిడార్‌ను గుర్తించేది లేదని, అది చట్ట విరుద్ధమని ఆర్మీ చీఫ్‌ అన్నారు. షక్సాగామ్ వ్యాలీ అనేది ఒక వ్యూహాత్మక లోయ. ఇది కారకోరం పర్వత శ్రేణులకు ఉత్తరాన ఉంది. చారిత్రక నేపథ్యం ప్రకారం, 1963లో కుదిరిన చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం ద్వారా పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని చైనాకు బదిలీ చేసింది, అయితే భారత్ దీనిని అంగీకరించలేదు. భారతదేశం ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో భాగంగా తన సొంత భూభాగంగా పరిగణిస్తుంది. సుమారు 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ లోయ, భౌగోళికంగా సియాచిన్ గ్లేసియర్‌కు చాలా దగ్గరగా ఉండటం వల్ల సైనిక పరంగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.