మలయాళ సీనియర్ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మళయాళంలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలోనే దశాబ్దాలుగా తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అగ్ర నటుడు మోహన్‌లాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ ఆయన దూసుకుపోతున్నారు. కేవలం ఒక్క పరిశ్రమకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ ‘అతి మనోహరం’, నెడుకండం మిరాకిల్, విష్ణు మోహన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అలాగే జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. అలాగే తాజాగా ఎనౌన్స్ చేసిన ‘L 370’పై కూడా మంచి అంచనాలున్నాయి. మోహన్ లాల్ ఆయన కెరీర్లో ఎన్నో క్లాసిక్ చిత్రాలలో అలరించారు. అయితే వైవిధ్యతకు ప్రాధాన్యమివ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. మారుతున్న కాలానికి తగినట్లుగా కొత్త దర్శకులతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపుతుంటారు. అనుభవజ్ఞులైన మేకర్స్‌తో పాటు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లకు కూడా ఆయన అవకాశాలు ఇస్తున్నారు. దీనివల్ల ఆయన చిత్రాల్లో వైవిధ్యతతో కూడిన సరికొత్త కథాంశాలు ఉంటాయి. గతంలో వచ్చిన విజయాల జోరును కొనసాగిస్తూనే, ఈ ఏడాది ఆయన చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. తరుణ్ మూర్తి దర్శకత్వంలో అతి మనోహరం,దిలీష్ పోతన్ దర్శకత్వంలో నెడుకండం మిరాకిల్ వంటి సినిమాలు ఉన్నాయి. కేరళలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా మోహన్‌లాల్‌కు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. ఆయన సినిమాలు డబ్బింగ్ కావడం, ఇక్కడి ప్రేక్షకులు వాటిని ఆదరించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ముఖ్యంగా వైవిధ్యభరితమైన కథలతో వస్తున్న ఆయన తాజా సినిమాలపై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్డేట్స్ ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు సినీ ప్రియులు సైతం మలయాళ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఇప్పుడు విపరీతంగా ఆదరిస్తున్నారు.