
Chamate Blackmail Fraud: ఇంటర్నెట్ ‘ – దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా..,అవగాహన లేని సమాజాన్ని మాత్రం పెను ప్రమాదంలోకి నెడుతోంది. తాజాగా ‘చిల్ చాట్’, ‘చామేట్’ యాప్ ల పేరుతో జరుగుతున్న అతి పెద్ద అశ్లీల బ్లాక్ మెయిల్ మాఫియా ఆగడాలు మేగా 9టీవీ నిఘా లో సూర్యాపేట జిల్లా లో వెలుగులోకొచ్చాయి.!,పవిత్రమైన బంధాలను, మహిళల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి పచ్చని పల్లెల్లో తన పంజా విసురుతుంది. మహిళల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని మన సమాజంలోకి విదేశీ శక్తులు చొరబడుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.!. “సూర్యాపేట జిల్లాలోని పలు మండలాలలో వందలాది మహిళలు ఈ ‘డిజిటల్ ట్రాప్’ ఉచ్చులో చిక్కుకున్నట్టు గా పోలీసులు భావిస్తున్నారు..నగ్న వీడియోలు, వ్యక్తిగత ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిల్ ఎలా చేస్తున్నారు?.. పోలీసుల అరెస్టులు,చైనా లింకులు – ఈ దారుణాలపై పూర్తి సంచలనాత్మక రిపోర్ట్ మీ మెగా 9టీవీ లో మీకోసం!
చామేట్” యాప్ మాఫియా వలలో మొదట చిక్కుకుంది అమాయక గ్రామీణ మహిళలు, యువతులే. .సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో, వీరు థర్డ్ పార్టీ లింకుల ద్వారా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్లే స్టోర్ లో లేని ఈ యాప్ లు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వేగంగా వ్యాపించాయి. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం,మఠంపల్లి, ఆత్మకూరు, కోదాడ, నాగారం, మల్లారెడ్డిగూడెం… ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఈ మాఫియాకు ప్రధాన కేంద్రాలుగా మారాయని తెలుస్తుంది. దాదాపు 200 మందికి పైగా మహిళలు ఉచిత రిజిస్ట్రేషన్ పేరుతో ఈ ఉచ్చులో ఇరుక్కున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా,ముగ్గురు ముఠా సభ్యులను,పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా బాధితులే అయినప్పటికీ ఈ బ్లాక్ మెయిల్ కు మూలమైన కీలక సమాచారాన్ని సేకరించే పనిలో సైబర్ నిపుణులు ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో మెగా 9 టీవీ వెలుగులోకి తెచ్చిన ఈ ‘డిజిటల్ ట్రాప్’ మాఫియా ఆగడాలు సైబర్ పోలీసుల విచారణతో ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి.పేద, మధ్య తరగతి,ఆర్థిక బలహీనతలు ఉన్న ఒంటరి మహిళలే టార్గెట్ గా స్థానిక వ్యక్తుల సహాయంతో ఈ ముఠా అసాంఘీక కార్యకలాపాలు కొనసాగిస్తూ, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.ప్లే స్టోర్ లో లభ్యమయ్యే ‘చిల్ చాట్’ లాంటి యాప్ లతో మొదట పరిచయమై తర్వాత ఆ మహిళలతో ‘చామేట్ యాప్’ ను లింక్ ద్వారా డౌన్లోడ్ చేయిస్తారు.. ఆ”యాప్ లో చేరిన తర్వాతే అసలు దారుణం మొదలవుతుంది. చాట్ ఏజెంట్లుగా చలామణి అవుతున్న ముఠా సభ్యులు, ముందుగా కొంత డబ్బు ఆశ చూపి, ఎక్కువ డబ్బు సంపాదించాలంటే, అశ్లీల వీడియో కాల్స్ చేయాలని, నగ్నంగా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కాల్స్ ను ఆటోమేటిక్ గా రికార్డ్ చేస్తోంది ఈ చామేట్ యాప్. ఒకసారి న్యూడ్ వీడియోలు రికార్డ్ అయిన తర్వాత, ఆ మహిళలను, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న పురుషులను టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడుతున్నారు. లక్షల రూపాయలు ఇవ్వకపోతే, ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని,స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపి పరువు తీస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
సూర్యాపేట జిల్లాలోని కొందరు ముఠా సభ్యులు స్థానిక మహిళలను ఈ ట్రాప్ లోకి దింపి అసాంఘీక కార్యకలాపాలకు సహకరించక పోతే వీడియోలు బయటపెడుతామని బెదిరించినట్టుగా తెలుస్తుంది.. ఆ మహిళలు కొందరు దైర్యంగా బయటికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.పోలీసుల ట్రాన్సాక్షన్ డేటా విశ్లేషణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.ఆయా మండలాల పరిధిలో పోలీసులు పలువురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ డిజిటల్ ట్రాప్ తో అంతర్జాతీయ హవాలా మార్గాల ద్వారా చైనాకు చెందిన కొన్ని సంస్థలకు డబ్బులు చేరుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. విదేశీ శక్తులు భారత్ లోని అమాయక మహిళలను టార్గెట్ చేస్తున్నాయనేది దీని ద్వారా స్పష్టమవుతోంది. అత్యంత సున్నితమైన ఈ కేసులో పది మందికి పైగా మహిళలను ఇప్పటికే పోలీసులు విచారించారు.. అయితే ఆ మహిళలంతా ఈ మోసపు వలలో చిక్కుకున్న బాధితులే అని పోలీసులు తెలిపారు. పరువు పోతుందనే భయంతో ఎవరూ మోసాన్ని దాచాల్సిన అవసరం లేదు.చట్టం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ నెట్వర్క్ ను నడుపుతున్న ఏజెంట్లను, బ్రోకర్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. త్వరలోనే కఠిన చర్యలు తీసుకుని, ఈ మాఫియాను మూలాలతో సహా పెకిలిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Chamate Blackmail Fraud.
సో మహిళలు బీ అలర్ట్…సులభ సంపాదన,డిజిటల్ ఫ్రీడమ్ పేరుతో మన సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నారో! మహిళల జీవితాలతో, మన కుటుంబాల ఆత్మగౌరవంతో పందెం కాస్తున్న ఈ “చామేట్” మాఫియాపై ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలి. . ఎవరైనా ఈ వలలో ఇరుక్కుంటే, ఆలస్యం చేయకుండా 1930 నంబర్ కు కాల్ చేయండి.. సైబర్ సెల్ వెబ్ సైట్ ద్వారా పిర్యాదు చేయ్యాలని పోలీసులు సూచిస్తున్నారు.