తమిళనాడులో గెలుపెవరిది..?

Spread the love

Tamilnadu Politics: తమినాడులో రాజకీయం మాంచి కాకమీదుంది. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతున్న కొద్ది పంచ్ పాలిటిక్స్ ఎక్కువవుతున్నాయి. అధికార – ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని స్టాలిన్ పార్టీ చూస్తుంటే.. ఈ సారి ఎలాగైనా.. తమిళ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయ్యాలని.. బీజేపీ తహతహలాడుతోంది. ఈ గ్యాప్ లో విజయ్ పార్టీ టీవీకే.. బీజేపీ నాకు పోటీనే కాదు.. మా లక్ష్యం డీఎంకే పార్టీని ఓడించడమే అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. ప్రజలు నాడీ ఏ విధంగా ఉంది. మరోసారి వైవిధ్యాన్ని చాటుకుంటారా..? రాజకీయ నిపుణుల అంచనాలు ఏంటి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది.. తమిళనాడులో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాజకీయ దిగ్గజలు కరుణా నిధి, జయలలిత మరణానంతరం డీఎంకే జయకేతనం ఎగురవేసింది. అన్నాడీఎంకే ఓడిపోయిన.. 75 సీట్లతో బలమైన పార్టీ అని నిరూపించుకుంది. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ద్రవిడ పార్టీల మధ్య పోటీ నెలకొంది. డీఎంకే – అన్నాడీఎంకే కూటములు గట్టిగా తలపడుతున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ – కాంగ్రెస్ పార్టీలు అంతంతమాత్రమే.. అందుకే రెండు పార్టీలు చెరోవైపు చేరిపోయాయి. మిగిలిన చిన్నా పార్టీలు కూడా అత్యధికం అధికారపార్టీ డీఎంకే వెంటే ఉన్నాయి. విజయ్ పార్టీ టీవీకే కొత్త శక్తిగా ఎదగాలనే చూస్తోంది. అయితే టీవీకే ఎంతవరకు సత్తా చాటుతుందో..? ఇప్పటికిప్పుడు అంచనా వేయ్యడం కష్టమే. తమిళనాడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే.. ఐదేళ్ల ప్రజల పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందని.. రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేత అంతగా లేదని.. అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభివృద్ధి లో తమిళనాడు దూకుడు మీద ఉందని.. మళ్లీ దేశంలో మొదటి స్థానానికి చేరుకోవడం మా ఘనతే అంటోంది డీఎంకే. పెట్టుబడి సాధనలో అందరికంటే ముందున్నట్లు నేతలు చెబుతున్నారు. పేద మహిళలకు నెలకు వెయ్యి రూపాయాల ఆర్ధిక సాయం, ఫ్రీ బస్సు ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తాయని నమ్ముతోంది. గత ఎన్నికల వేళ పథకాన్ని వ్యతిరేకించిన అన్నాడీఎంకే.. ఇప్పుడు అధికారంలోకి వస్తే.. 15వందల రూపాయాలు ఇస్తామంటోంది. గవర్నమెంట్ స్కూల్స్ లో అల్పహారం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పాఠశాల విద్యార్థుల్లో ఎవరికైనా పెరేంట్స్ లో ఒకరు లేకపోయిన నెలకు వెయ్యి రూపాయాల సాయం, తమిళ మీడియా విద్యార్థులకు 6 నుంచి 12 వ క్లాస్ వరకు నెలకు వెయ్యి ప్రోత్సహం అందిస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ తో యువత ఉపాధి కల్పనకు కృషి చేస్తోంది. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే వారికి ఉచిత కోచింగ్ సౌకర్యం కల్పిస్తోంది. ఇవన్నీ ప్రజలను మెప్పించాయని డీఎంకే బలంగా నమ్ముతోంది.

అయితే మైనస్ లు ఏం లేవా..? అంటే ఉన్నాయి. కరుణానిధి తర్వాత స్టాలిన్ సిఎం అయ్యారు. నెక్ట్స్ ఎవరు అంటే.. డిప్యూటీ సీఎంగా ఉన్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, ఢిల్లీలో ఎంపీగా చక్రం తిప్పుతున్న సోదరి కనిమొళిని, దగ్గరి బంధువు దయనిధి మారెన్ కూడా ఎంపీగా ఉన్నారు. వీటితో డీఎంకే పార్టీపై కుటుంబ ముద్ర మరింత బలపడింది. ఇక రెండేళ్ల కిందట మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ తో సెంథిల్ బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెయిల్ రాగానే మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. దానిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. బెయిల్, మంత్రి పదవుల్లో ఏది కావాలో సుప్రీంకోర్టు తేల్చుకోమని చెప్పడంతో.. బాలాజీకి మంత్రి పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. ఎన్నిక షెడ్యూల్ వచ్చే లోపు సుప్రీంకోర్టులో కేసు తేలితే.. బాలాజీకి మళ్లీ పదవి ఖాయమని ప్రచారముంది. మరో ఇద్దరు మంత్రులు పోన్మురి, పెరియా స్వామి ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ అరెస్ట్ అయితే చేయ్యలేదు. ఇది డీఎంకే కి డ్యామేజ్ ను కవర్ చేసిందని చెప్పాలి. కింది నుంచి పైస్థాయి నేతల వరకు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందేమో అని అని డీఎంకే ఆందోళన చెందుతుంది.

ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలుకు గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇప్పటివరకు అతిగతి లేదు. రెండు నెలలకు ఒకసారి తీసే.. కరెంట్ రీడింగ్, నెలకోసారి తీసే.. తీస్తామని చెప్పి.. మాట నిలబెట్టుకోలేదు. వంట గ్యాస్ సిలిండర్ కు 100 రూపాయాలు సాయం చేస్తామని మర్చిపోయారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో 25 లాకప్ డెత్ లు, అన్నా యూనివర్సిటీలో యువతిపై అత్యాచారం ఘటన శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రతిపక్షం సంగతి ఎలా ఉన్న.. గవర్నర్ ఆర్.ఎన్ రవితో స్టాలిన్ కు నిత్య పోరాటం తప్పలేదు. అసెంబ్లీ ఆరోపించిన బిల్లులను సుప్రీంకోర్టు పక్కన పెట్టడం, కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవడం రోటిన్ గా మారిపోయింది. ప్రభుత్వంపై కొందరు నేరుగా చేస్తున్న ఆరోపణలు స్టాలిన్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి బాగానే ఉన్న.. కొంగునాడుగా పిలిచి తిరుపుర్, ఈ రోడ్, కొయంబత్తూర్ లో డీఎంకే బాగా బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో అక్కడ సీట్లు రాలేదు. ఈ సారి పరిస్థితి అంత గొప్పగా ఉండకపోవచ్చని పార్టీ భావిస్తోంది.

ఐదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చున్న అన్నాడీఎంకే.. పరిస్థితి అంత మెరుగ్గా లేదని విశ్లేషకులు అంచనా. జయలలిత లేకపోవడం పార్టీకి తీరని లోటు. ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకులు పార్టీలో లేరు. పళని స్వామి నాయకత్వానికి ఎంతన్నది చెప్పలేని స్థితి. పన్నీరు సెల్వం టీటీవీ దినకరన్ ఓ వైపు సవాళ్లు విసురుతుంటే.. సీనియర్ నేత సెంగోట్టంతో కొత్త తలనొప్పులు తప్పడం లేదు. పార్టీ లో ఎవ్వరికి ఏ సమస్య వచ్చిన.. అమిత్ షాను కలుస్తున్నారు. ఇది డీఎంకే కి అస్త్రంగా మారింది. కొంగునాడులో పార్టీ పటిష్టంగా ఉంది. కానీ.. దక్షిణ జిల్లాల్లో పట్టుకున్న పన్నీర్ సెల్వం బహిష్కరణతో.. పార్టీకి నష్టమే అంటున్నారు. ఎన్నికల గుర్తు కోసం ఇప్పటికీ కొట్లాటలు జరుగుతునే ఉన్నాయి. అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకొని పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ.. దినకరన్, పన్నీర్ సెల్వన్ గ్రూపులను చల్లార్చే ప్రయత్నాల్లో ఉంది. వాళ్లను చేరాదీస్తే.. పార్టీకి మేలు జరుగుతుందనే అభిప్రాయంతో ఉంది.

అయితే తమిళనాడు రాష్ట్రంలో కూడా కూటముల హవా సాగుతోంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసిడీఎంకే లాంటి దాదాపు 10 పార్టీలు.. అధికార డీఎంకే వెంట ఉన్నాయి. ఇటీవలే.. డీఎంకే మద్దతు తో కమలహాసన్ రాజ్యసభకు వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేసిన, చేయ్యకపోయిన..మద్దతు మాత్రం డీఎంకే కే అన్నది అందరికి తెలిసిన విషయమే. విజయ్ కాంత్ చనిపోయిన.. ఆయన సతీమణి పార్టీని నడిపిస్తున్నారు. ఆమెకు డీఎంకే కి జై కొడతారని భావిస్తున్నారు. 2021 లో అన్నాడీఎంకే తో కలిసి పోటీ చేసిన బీజేపీ.. 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. లోక్ సభ ఎన్నికల్లో విడిగా బరిలో నిలిచి.. ఒక్క చోట గెలవకపోవడంతో ఇప్పుడు డీఎంకే తో జట్టు కట్టాయి. కరూర్ ఘటనతో కష్టాల్లో ఉన్న విజయ్ ను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తమిళనాడు నార్త్ జిల్లాల్లో పట్టున్న బీఎంకే ఇప్పటి వరకు ఎటు తేల్చుకోలేదు. డీఎంకే ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యమంటున్న బీఎంకే.. అన్నా డీఎంకే కు దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది.

తమిళనాడు ప్రజలకు తామే ప్రత్యమ్నాయమని.. పార్టీ పెట్టిన విజయ్ బలం ఎంతన్నది అప్పుడే చెప్పడం కష్టమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణం లేదు. క్యాడర్ నాయకులు అంతగా లేరు. కానీ విజయ్ మాస్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. వీరిలో 20 నుంచి 40 వయస్సు వారే ఎక్కువే. వీరంతా విజయ్ పార్టీకి ఓటు వేస్తారని చెప్పాలేం. అలాగని తోసి పుచ్చలేం. పార్టీ ప్రారంభం, ఎన్నికల ప్రచారం.. జోరుగా సాగింది. ప్రతి శనివారం జిల్లాల్లో పర్యటించిన విజయ్ కి అనుకుంత అనుకూల గ్రాఫ్ వచ్చింది. అయితే ఎప్పుడైతే కరూర్ తొక్కిసలాటలో 41 చనిపోయారో.. ఈ సంఘటనలో ఆయనకు, ఆయన పార్టీకి చెడ్డ పేరు తెచ్చింది. ఘటన తర్వాత బాధితులను పరామర్శించకపోవడం విమర్శలకు దారి తీసింది. తొక్కసలాటలో కుట్ర కోణం ఉందని టీవికే ఆరోపించింది. బలపదర్శనకు విజయ్ ప్రయత్నించడం, నిర్వహణ లోపాలే కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత ఇప్పటి వరకు విజయ్ జనంలోకి రాలేదు. వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో..? కరూర్ ఘటన ఏలాంటి రిజల్ట్ ను ఇస్తుందో.. విజయ్ సహ టీవీకే నేతలు ఆందోళన చెందుతున్నారు. Tamilnadu Politics.

సీఎం పదవి పై ఆశ తప్పా.. విజయ్ కి సొంత ఎజెండా లేదని విమర్శలున్నాయి. డీఎంకే బీ టీం అని డీఎంకే విమర్శిస్తుంటే.. బీజేపీ కే బీ టీం అని డీఎంకే ప్రతి విమర్శలు చేస్తోంది. తామేవ్వరికి బీ టీమ్ కాదని.. ప్రజాలే మా అధిష్టామని టీవీకే అంటోంది. గతంలో విజయ్ అభిమానులు సీమాన్ నాయకత్వంలోని నాన్ తమిళన్ కచ్చి ఎన్.టీకే కి మద్దతు ఇచ్చారు. 2021 ఎన్డీకే కి 8 శాతం ఓట్లు వచ్చాయి. అందులో 2 నుంచి 3 శాతం మంది మూడు శాతం మంది ఇప్పుడు టీవీకే వైపు మళ్లుతారని అంచనా. మొత్తంగా టీవీకే కి వచ్చే ఓట్లు 10 నుంచి 12 శాతం వరకే ఉండొచ్చన్నది రాజకీయ వ్యూహకర్తల లెక్క. అందుకే తిరుచ్చి వంటి సేఫ్ సిటి నుంచి విజయ్ సిద్దమయ్యారనే వాదన ఉంది. విజయ్ పార్టీకి ఎన్ని ఓట్లు పడిన.. ఎవరికి గండి కొడతారో అని.. డీఎంకే, అన్నాడీఎంకే లు కలవపడుతున్నాయి. తమిళనాడులో 1980 నుంచి 2011 వరకు ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారేది. 2016 లో వరుసగా రెండోసారి గెలిచి.. సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. ఆమె మరణానంతరం 2021 లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధికార పీఠం ఎక్కింది. ఈ సారి కొనసాగింపు ఉంటుందా..? లేదంటే పాత పద్దతి రిపీట్ అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.