భారత రక్షణ రంగ ముఖచిత్రం కొత్త రూపుసంతరించుకుంటోంది. అజేయమైన శక్తిగా భారత్ అవతరించడానికి వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన పర్యటన మాత్రమే కాదు.. అది నవ భారత రక్షణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయయంగా నిలవనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికత కలిగిన ఇజ్రాయెల్‌తో భారత్ జరుపుతున్న ఈ 93.5 బిలియన్ డాలర్ల ఒప్పందం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత్ తన సత్తాను మరోసారి చాటబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన భారత సైనిక శక్తిని ‘నెక్స్ట్ లెవల్’కు తీసుకెళ్లే ఒక చారిత్రక అడుగు.భారత్ శాంతిని కాంక్షించే దేశం అయితే అవసరమైనప్పుడు తన శక్తిని ప్రదర్శించగలదు అని అప్పటి వాజ్ పేయి మాటలు అక్షర సత్యం. సమకాలీన పరిస్థితులకు సరిపోయేలా అమ్ములపొదిని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలన్నింటిలోకి ఇప్పుడు జరగనున్న ఒప్పందమే అతిపెద్దదని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికులు తలపడటం మాత్రమే కాదు.. అది సాంకేతికతతో ఆడుకునే చదరంగం. ఇజ్రాయెల్ రక్షణ సాంకేతికతలో ప్రపంచానికే గురువు. అటువంటి దేశంతో భారత్ జతకట్టడం అంటే, శత్రువులకు సింహస్వప్నమే. ముందస్తు జాగ్రత్తే అసలైన విజయం అని భారత్ భావిస్తోంది. రేపటి యుద్ధం టెక్నాలజీతోనే అని గ్రహించి, ఈ భారీ పెట్టుబడికి సిద్ధమైంది.గత కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ భారత్‌కు నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. కార్గిల్ యుద్ధం సమయం నుండి నేటి ఆధునిక క్షిపణి వ్యవస్థల వరకు ఇజ్రాయెల్ సహకారం మరువలేనిది. ఇప్పుడు ఈ భారీ డీల్ ద్వారా ఈ బంధం మరింత గట్టిపడనుంది.ఈ ఒప్పందంలో భాగంగా సాంకేతికత బదిలీ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల భారత్‌లోనే ఆధునిక ఆయుధాల తయారీ వేగం పుంజుకుంటుంది.డిఫెన్స్ సెక్టార్ లో కొత్త పరిశ్రమలు, స్టార్టప్‌లు రావడం వల్ల వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది.చైనా, పాకిస్థాన్ వంటి సరిహద్దు దేశాల సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ ఏఐ మరియు డ్రోన్ వ్యవస్థలు కీలకం కానున్నాయి. ఈ భారీ డీల్ గురించి వార్తలు రావడంతోనే ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. ఒక దేశం తన రక్షణ కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తోందంటే, అది తన స్వయం సమృద్ధిని ఎంతలా ఆకాంక్షిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఎంతటి బలవంతుడైనా తన శక్తిని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. భారత్ చేస్తున్నది కూడా అదే. ప్రపంచ పటంలో ఒక అతిచిన్న దేశం.. కానీ అగ్రరాజ్యాలనే గడగడలాడించే ఆయుధ సంపత్తి దాని సొంతం. సాంకేతికతలో ఆ దేశానిది తిరుగులేని రికార్డ్. అదే ‘ఇజ్రాయెల్’. ఇప్పుడు ఈ దేశం వైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన. ఈ పర్యటన కేవలం పలకరింపులకే పరిమితం కాదు.. రక్షణ రంగంలో పెను మార్పులకు నాంది పలకబోతోంది. రక్షణ రంగంలో ఇజ్రాయెల్ తయారీ అంటేనే ఒక బ్రాండ్. అత్యాధునిక డ్రోన్లు, సెన్సార్లు, రాడార్ వ్యవస్థలు మరియు సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్‌కు సాటి వచ్చే దేశం మరొకటి లేదు. మన దేశ భద్రతలో కూడా ఇజ్రాయెల్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్ సైజులో చిన్నదైనా, దాని రక్షణ వ్యవస్థ ఆయుధ సంపత్తిలో ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ బలానికి మరో ప్రధాన కారణం వారి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మోసాద్’. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ ఏజెన్సీగా దీనికి పేరుంది. “గోడకు కూడా చెవులు ఉంటాయి” అంటారు కానీ, మోసాద్‌కు శత్రువు ఆలోచన కూడా ముందే తెలుస్తుందని ప్రతీతి. శత్రువు ఎక్కడ ఉన్నా సరే, వెతికి పట్టుకుని మరీ వేటాడటంలో మోసాద్ స్టైలే వేరు. భారతదేశం తన నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో మోసాద్ సహకారం అత్యంత కీలకం కానుంది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై ఇరు దేశాల రక్షణ నిపుణులు ఎంతో ఆశతో ఉన్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో కొన్ని భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నిఘా మరియు దాడి చేయగల అత్యాధునిక డ్రోన్లను భారత్ సొంతం చేసుకోనుంది. నేల నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణుల తయారీలో మరింత లోతైన ఒప్పందాలు ఉండవచ్చు.కేవలం కొనడమే కాకుండా, ఇజ్రాయెల్ టెక్నాలజీతో భారత్‌లోనే ఆయుధాల తయారీకి సంబంధించిన ఒప్పందాలు జరగనున్నాయి.ఇటు భారతదేశ బలం, అటు ఇజ్రాయెల్ సాంకేతికత కలిస్తే ప్రపంచ రక్షణ రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. భారత్ , ఇజ్రాయెల్ ఉగ్రవాదంపై పోరాటంలో ఇరు దేశాలదీ ఒకే మాట. ఆపదలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు” అన్నట్లుగా, యుద్ధ సమయాల్లో భారత్‌కు అవసరమైన సమాచారాన్ని, ఆయుధాలను అందించడంలో ఇజ్రాయెల్ ఎప్పుడూ ముందుంటుంది.ఈ పర్యటన కేవలం ఆయుధాల కొనుగోలుకే పరిమితం కాకుండా.. వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనలు మరియు నీటి నిర్వహణ వంటి రంగాల్లో కూడా సరికొత్త ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుంది. భారత్, ఇజ్రాయెల్‌తో భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏఐ సాంకేతికతతో డ్రోన్లు, యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్-ఆఫ్ క్షిపణులు ఇతరాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే రక్షణపరంగా భారత్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది. దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా భారత్ అడుగులు వేస్తోంది.