ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించిన పంజాబ్ కింగ్స్..గుజరాత్ టైటాన్స్ పై గెలుపు

Spread the love

గతేడాది ఫైనల్ లో ఓటమితో ముగించిన పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్ ను విజయంతో ఆరంభించింది. తాజాగా న్యూ ఛండీగఢ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 39 (27; 6×4), జాస్ బట్లర్ 38 (33; 3×4, 2×6), గ్లెన్ ఫిలిప్స్ 25 (17; 1×4, 1×6) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ గుజరాత్ బ్యాటర్లను  కట్టడి చేశారు. విజయ్ కుమార్ వైషాక్ 3 వికెట్లు, యుజువేంద్ర చాహల్ 2 వికెట్లు, మార్కో యెన్సెన్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం టార్గెట్ ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కూపర్ కన్నోలీ 72 నాటౌట్ (44; 5×4, 5×6) పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ 37 (24; 1×4, 4×6) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 3 వికెట్లు, కగిసో రబడా, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *