రెండో వన్డేలో భారత్ పై ఆస్ట్రేలియా విజయం

Spread the love

భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. టీ 20 సిరీస్ గెలిచిన భారత జట్టు వన్డేల్లో మాత్రం తడబడింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 54 (70; 2×4, 1×6), ప్రతీక రావల్ 52 (81; 6×4) హాఫ్ సెంచరీలతో రాణించారు. స్మృతీ మంథన (31), కాశ్వీ గౌతమ్ (25), రిచా గోష్ (22) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లే గార్డనర్, అన్నాబెల్, అలనా కింగ్ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. మెగాన్, నికోలా క్యారీ ఒక్కో వికెట్ తీశారు.  అనంతరం టార్గెట్ ను ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. జార్జియా వోల్ 101 (82; 13×4, 1×6) సెంచరీతో సత్తా చాటింది. లిచ్ఫీల్డ్ 80 (62; 11×4, 1×6)తో రాణించింది. దీంతో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో కాశ్వీ గౌతమ్ 2 వికెట్లు, దీప్తి శర్మ 2 వికెట్లు, క్రాంతి గౌడ్ 1 వికెట్ తీశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *