హోరాహోరీ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ గెలుపు

Spread the love

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ సూపర్-8 మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. కొలొంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో కివీస్ ను ఓడించింది. మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (39)టాప్ స్కోరర్. టిమ్ సెఫర్ట్ (35), ఫిన్ అలెన్ (29) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 2 వికెట్లు, విల్ జాక్స్ 2 వికెట్లు, రెహాన్ అహ్మద్ 2 వికెట్లు, లియామ్ డాసన్ 1 వికెట్ తీశారు. ఇక ఇంగ్లాండ్ టార్గెట్ ఛేజింగ్ లో ఫిలిప్ సాల్ట్ (2), బట్లర్ (0) వికెట్లు కోల్పోయి మొదట్లో ఇబ్బందిపడినా మిగతా బ్యాటర్లు తమ వంతు పాత్ర పోషించడంతో గెలుపు తీరాలకు చేరింది. టామ్ బాన్ టన్ (33), విల్ జాక్స్ (32 నాటౌట్), హ్యారీ బ్రూక్ (26), సామ్ కర్రన్ (24),బెథెల్ (21), రెహాన్ అహ్మద్ (19 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ 19.3ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు. గ్లెన్ ఫిలిప్స్, ఫెర్గుసన్, హెన్రీ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *