ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు మొదటి పరాజయం..!

Spread the love

ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ కు మొదటి పరాజయం ఎదురైంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆ జట్టు పరాజయం పాలైంది. పంజాబ్ లోని న్యూ చంఢీఘడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 59 (44; 6×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రియాన్ష్ ఆర్య (29), కూపర్ కన్నోలీ (30), శ్రేయాస్ అయ్యర్ (30), మార్కస్ స్టోయినీస్ 62 (22; 4×4, 6×6) చెలరేగడంతో భారీ టార్గెట్ ను నిర్దేశించింది. రాజస్థాన్ బౌలర్లలో యష్ రాజ్ పంజా 2 వికెట్లు, నాన్ద్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ 51 (27; 7×4, 1×6), వైభవ్ సూర్యవంశీ 43 (16; 3×4, 5×6) మంచి ఆరంభాన్ని అందించారు. ధ్రువ్ జురెల్ 16 (20; 1×6) స్వల్ప పరుగులకే పరిమితమైనా రియాన్ పరాగ్ (29), డెనోవన్ ఫెరీరా 52 నాటౌట్ (26; 6×4, 3×6), శుభమ్ దూబే 31 నాటౌట్ (12; 3×4, 2×6) రాజస్థాన్ కు  సునాయాసంగా విజయాన్ని అందించారు. రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు, అర్ష్ దీప్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి 3వ స్థానంలోకి దూసుకెళ్లింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *