జపాన్ రాయబారి ఒనో కెయిచిని కలిసిన మంత్రి లోకేష్

Spread the love

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భారత్ లోని జపాన్ రాయబారి ఒనో కెయిచి (ONO Keiichi) ని కలిశారు. ఈ మేరకు లోకేష్ ‘ఎక్స్’ లో ఫోటోలు షేర్ చేశారు. వారిని  కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు జపాన్ దేశాల మధ్య లోతైన, పెరుగుతున్న సహకారంపై మేము ఫలప్రదమైన చర్చలు జరిపాము. ఇప్పటికే శ్రీ సిటీలో అనేక ప్రముఖ జపాన్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం మరియు ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశానికి జపాన్ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించే మార్గాలపై కూడా చర్చించినట్లు లోకేష్ పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *