ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భారత్ సెమీస్ చేరింది. తాజాగా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో 4-1తో వేల్స్ పై విజయం సాధించి పూల్-బిలో అగ్రస్థానం సాధించింది. ఈనెల 13న జరిగే సెమీస్ లో ఇటలీతో భారత జట్టు తలపడనుంది. ఉరుగ్వేపై స్కాట్లాండ్ గెలవడంతో సెమీస్ కు అర్హత సాధించింది. తర్వాత వేల్స్ పై అదిరే విజయంతో భారత్ కు గ్రూప్ లో టాప్ ప్లేస్ ఖాయమైంది. 29, 34, 55వ నిమిషాల్లో మూడు గోల్స్ సాధించిన నవనీత్ టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ గెలుపుతో భారత్ కు వరల్డ్ కప్ బెర్తు కూడా సొంతమైంది.