తాజా ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 875 పాయింట్లతో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో విధ్వంసక ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఈ టాప్ జాబితాలో మరో స్టార్ హిట్టర్ ఇషాన్ కిషన్ 871 పాయింట్లతో నాలుగు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. పాయింట్లలో అభిషేక్ కు దగ్గరగా వచ్చిన అతడు రెండో ర్యాంకులో నిలిచాడు. తిలక్ వర్మ 7వ ర్యాంకులో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 9వ ర్యాంకులో నిలిచారు. బౌలర్లలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నెంబవర్ వన్ ర్యాంకు కోల్పోయాడు. అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. దీంతో వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ ల లిస్టులో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా,హార్దిక్ పాండ్య వరుసగా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.