సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ హిట్టర్ అభిషేక్ శర్మ మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. తాజాగా ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మరోసారి తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 28 బాల్స్ లో 5×4, 8×6లతో 74 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ టోర్నీలో 20 కన్నా తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా అరుదైన ఫీట్ సాధించాడు. గత ఐపీఎల్ సీజన్లలో ఇప్పటికే నాలుగుసార్లు అభిషేక్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. 2026 ఏప్రిల్ 11న నేడు పంజాబ్ పై 18 బాల్స్ లో 2025, మే 19: లక్నోపై 18 బాల్స్ లో, 2024, మార్చి 27: ముంబయి ఇండియన్స్ పై 16 బాల్స్ లో 2024, మే 8: లక్నోపై 19 బాల్స్ లో, 2024, ఏప్రిల్ 12: పంజాబ్పై 19 బాల్స్ లో రన్స్ చేశారు. కాగా.. ఈ లిస్టులో అభిషేక్ తర్వాత నికోలస్ పూరన్ ఉన్నాడు. ఐపీఎల్లో నాలుగు సార్లు 20 కంటే తక్కువ బంతుల్లోనే పూరన్ హాఫ్ సెంచరీలు చేశాడు. జేక్ ఫ్రేజర్, ట్రావిస్ హెడ్, వైభవ్ సూర్యవంశీ మూడుసార్లు 20బంతుల్లోపే హాఫ్ సెంచరీ చేశారు. ఇక, ఐపీఎల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ పేరు మీద ఉంది. 2023లో అతడు కే.కే.ఆర్ పై కేవలం 13 బాల్స్ లోనే 50 రన్స్ పూర్తి చేశాడు.