రాజస్థాన్ విజయాలకు బ్రేక్…అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ 

Spread the love

ఈ సీజన్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్  మొదటి ఓటమి చవిచూసింది. తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఓటమి చెందింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 (44; 8×4, 6×6)లతో చెలరేగాడు. హెన్రిచ్ క్లాసిన్ 40 (26; 1×4, 3×6), నితీష్ కుమార్ రెడ్డి 28 (13; 4×6), సలీల్ అరోరా 24 నాటౌట్ (13; 2×4, 2×6) ధాటిగా ఆడడంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.  ఇక పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్ లో మాత్రం ఘోరంగా తడబడింది. యశస్వీ జైశ్వాల్ (1), వైభవ్ సూర్యవంశీ (0), ధ్రువ్ జురెల్ (0), ప్రిటోరియాస్ (0)రియాన్ పరాగ్ (4) దారుణంగా విఫలమయ్యారు. ఫెరీరా 69 (44; 7×4, 3×6), రవీంద్ర జడేజా 45 (32; 5×4)లు రాణించడం, ఆఖర్లో తుషార్ దేశ్ పాండే 25 (11; 3×6) బ్యాట్ ఝళిపించడంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో మంచి ప్రదర్శన కనబరిచింది. కొత్త బౌలర్లు సాకిబ్ హుస్సేన్,, ప్రఫుల్ హింజ్ లు 4 వికెట్లు చొప్పున పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈషన్ మలింగా 2 వికెట్లు తీశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *