భారత్ కు చేరుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

Spread the love

మిడిల్ ఈస్ట్ లోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ లో చిక్కుకుపోయిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు భారత్ కు సురక్షితంగా చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నేను క్షేమంగా బెంగళూరులోని నా ఇంటికి చేరుకున్నాను. గత కొన్ని రోజులు ఎంతో ఉత్కంఠభరితంగా, అనిశ్చితితో గడిచాయి. కానీ మళ్ళీ నా ఇంటికి చేరుకున్నందుకు నిజంగా కృతజ్ఞతతో ఉన్నాను. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి, మా పట్ల ఎంతో శ్రద్ధ వహించిన గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ విభాగం మరియు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు చూపిన సానుభూతి మరియు వృత్తిపరమైన బాధ్యత మాటల్లో చెప్పలేనంత గొప్పవిని పేర్కొన్నారు. ప్రస్తుతానికి, కాస్త విశ్రాంతి తీసుకుని, మనసుని ప్రశాంతం చేసుకుని, తదుపరి అడుగుల గురించి ఆలోచించాల్సిన సమయం ఇదని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *