బీసీసీఐ కామెంటేటర్ గా రిటైర్ అవుతున్నట్లు మాజీ ఆటగాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్ ప్రకటించారు. 1980ల ప్రారంభంలో భారత క్రికెట్ లో లెగ్ స్పిన్నర్ గా తనదైన ముద్ర వేసిన ఆయన తాజాగా తన కామెంటేటర్ గా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ప్రకటనను తెలియజేశారు. నేను బిసిసిఐ (BCCI) వ్యాఖ్యాతగా రిటైర్ అవుతున్నాను. గత 23 ఏళ్లుగా నన్ను టాస్ మరియు ప్రెజెంటేషన్ల కోసం ఉపయోగించుకోలేదు, కానీ కొత్తగా వచ్చిన వారు పిచ్ రిపోర్ట్, టాస్ మరియు ప్రెజెంటేషన్లు చేస్తున్నారు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఇదే జరిగింది, దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నా రిటైర్మెంట్ అనేది పెద్ద విషయమేమీ కాదు, కానీ దీని వెనుక ఒక టీవీ ప్రొడక్షన్ కథ దాగి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి చిత్రాన్ని మీరు చూస్తారు అంటూ ఆయన పోస్ట్ చేశారు.