మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత యువ షట్లర్ఆయుష్ శెట్టి పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ విన్నర్ లీ జియాను ఓడించి ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఆయుష్ 21-12, 21-17తో లీ జియాపై విజయం సాధించాడు. స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కూడా అదరగొట్టాడు. తొలి రౌండ్లో అతడు 21-16, 15-21, 21-14తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై నెగ్గి ప్రిక్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక బాన్సోద్ 11-21, 11-21తో థాయ్లాండ్ కు చెందిన ఇంతానన్ రచనోక్ చేతిలో పరాజయం పాలైంది.