టేబుల్ టాపర్ గా బెంగళూరు.. థ్రిల్లింగ్ మ్యాచ్ లో ముంబై పై విజయం

Spread the love

ఉత్కంఠ మ్యాచ్ లో విజయం సాధించి టేబుల్ టాపర్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తాజాగా ముంబై ఇండియన్స్ తో హోరా హోరీ గా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఆఖరి బంతికి గెలిచింది. రాయ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ 57 (42; 3×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. నమన్ ధీర్ 47 (32; 5×4, 2×6) పర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ 22 (10; 2×4, 2×6), రాజ్ బవా (16), విల్ జాక్స్ (10) పరుగులు చేశారు. బౌలింగ్ కు సహాకరించిన పిచ్ పై పరుగులు రాబట్టడినికి  బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. హేజల్ వుడ్, రేసింగ్, షెపర్డ్ లు ఒక్కో వికెట్ తీశారు.  అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూరు కూడా ఆరంభంలో కీలక వికెట్లను కోల్పోయింది. విరాట్ కోహ్లీ (0), రజత్ పటిదార్ (8), దేవ్ దత్ పడిక్కల్ (12) స్వల్ప పరుగులకే ఈ బ్యాటర్లు వెనుదిరిగారు. అయితే కృనాల్ పాండ్య 73 (46; 4×4, 5×6) కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. జాకోబ్ బెతెల్ (27),జితేష్ శర్మ (18)  పరుగులు చేశారు. టిమ్ డేవిడ్ (0) విఫలమయ్యాడు. ఇక ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ సిక్సర్ తో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ లో 4 వికెట్లు తీసి సత్తా చాటిన భువనేశ్వర్ కుమార్ జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ తో కూడా ఆకట్టుకున్నాడు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో బెంగళూరు విజయవంతంగా ఆ రెండు పరుగులు పూర్తి చేసి ఉత్కంఠ మ్యాచ్ లో ముంబై పై పైచేయి సాధించి గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు, ఘజన్ ఫర్, రాజ్ బవా ఒక్కో వికెట్ పడగొట్టారు. బౌలింగ్, బ్యాటింగ్ లో ఆకట్టుకున్న భువనేశ్వర్ కుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *