సమిష్టిగా రాణించి మరో విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్

Spread the love

చెన్నై సూపర్ కింగ్స్ నిలకైడైన ప్రదర్శనతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్ రేసును సజీవంగా ఉంచుకుని ముందుకు సాగుతోంది. తాజాగా ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై లోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్ 85 (33; 10×4, 6×6) దూకుడైన ఆటతీరుతో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. షాబాజ్ అహ్మద్ 43 నాటౌట్ (25; 3×4, 3×6) ధాటిగా ఆడడంతో లక్నో 200 పరుగుల మార్క్ దాటింది. అక్షత్ రఘవంశీ (18), హిమ్మత్ సింగ్ (17), రిషబ్ పంత్ (15) పరుగులు చేశారు. మిచెల్ మార్ష్ (10), మార్క్రమ్ (6), నికోలస్ పూరన్ (1) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టాడు. అన్షూల్ కాంబోజ్ 2 వికెట్లు, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఉర్విల్ పటేల్ 65 (23; 2×4, 8×6) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సంజూ శాంసన్ 28 (14; 3×4, 2×6), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42 (28; 3×4, 2×6), కార్తీక్ శర్మ (20), శివమ్ దూబే (15 నాటౌట్), ప్రశాంత్ వీర్ (18 నాటౌట్) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన చెన్నై ఈ మ్యాచ్ విజయంతో మరో రెండు పాయింట్లు గెలుచుకుంది. దీంతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 5వ స్థానంలో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *