ఆసియా క్రీడల్లో క్రికెట్ షెడ్యూల్ ఖరారు..డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనున్న భారత్ 

Spread the love

ఆసియా క్రీడల్లో క్రికెట్ షెడ్యూల్ ఖరారైంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో మహిళా క్రికెట్ జట్టు బరిలోకి దిగనుంది. ఇక పురుషుల టీమ్ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో ఆడనుంది. మహిళా టీమ్ సెప్టెంబర్ 18న జపాన్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్ లో బై లభించడంతో రెండు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనున్న విషయం తెలిసిందే. పురుషుల జట్టు సెప్టెంబర్ 28న మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత పురుషుల జట్టు సెమీ ఫైనల్ లో ఎవరితో తలపడుతుందో ఇంకా ఖరారు కాలేదు. ఆఫ్గనిస్తాన్, జపాన్, నేపాల్ లు గ్రూప్ ఏ లో ఉన్నాయి. వీటిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మహిళల ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 22న పురుషుల టీమ్ ఫైనల్ అక్టోబర్ 3న జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు అంతర్జాతీయ ట్వంటీ20 (T20I) ఫార్మాట్‌లో సాగుతాయి. జపాన్‌ హోస్ట్ చేయనుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలు సరికొత్త జోష్  తీసుకురానున్నాయి. ఈ సారి జపాన్‌లోని ఐచి-నగోయా నగరంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 3, 2026 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఆసియాలోని టాప్  జట్లు ఈ పతకాల పోరులో తలపడనున్నాయి.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ క్రీడల కోసం బలమైన జట్లను రంగంలోకి దించుతోంది. గత రికార్డులు మరియు ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్‌తో పాటు మరికొన్ని అగ్ర శ్రేణి జట్లు గ్రూప్ దశలు ఆడకుండా, నేరుగా క్వార్టర్ ఫైనల్స్ నుండే తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి.డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న భారత పురుషుల, మహిళల జట్లపై భారీ అంచనాలు ఉన్నాయి. గత ఆసియా క్రీడల్లో సాధించిన బంగారు పతకాలను ఈసారి కూడా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో భారత జట్లు బరిలోకి దిగుతున్నాయి. గత ఆసియా క్రీడల్లో  భారత క్రికెట్ జట్లు చారిత్రాత్మక ప్రదర్శన చేశాయి. పురుషుల, మహిళల రెండు విభాగాల్లోనూ భారత్ ఘన విజయం సాధించి రెండు బంగారు పతకాలను  కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల క్రికెట్ చరిత్రలో భారత్ ఇలా క్లీన్ స్వీప్ చేయడం ఇదే మొదటి సారి. ఇక భారత పురుషుల జట్టు అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ద్వారా బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ రజత పతకాన్ని, బంగ్లాదేశ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాయి.మరోవైపు, భారత మహిళల జట్టు ఫైనల్ పోరులో శ్రీలంకపై గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల జట్టు దేశానికి తొలి స్వర్ణాన్ని అందించగా, శ్రీలంక రజతాన్ని, బంగ్లాదేశ్ కాంస్య పతకాలు అందుకున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *