తాజాగా ప్రకటించిన మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నెంబర్ వన్ గానే కొనసాగుతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 8వ స్థానంలో కొనసాగుతోంది. జెమీమా రోడ్రిగ్స్ 12వ ర్యాంకు లో కొనసాగుతోంది. ఇక సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ 2వ స్థానంలో, ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ 3వ స్థానంలో ఉన్నారు. ఆసీస్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డ్నర్ 4వ స్థానంలో, ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్సివర్ బ్రంట్ 5వ స్థానంలో టాప్-5లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్ లో భారత్ నుంచి అత్యుత్తమంగా దీప్తి శర్మ 6వ స్థానంలో నిలిచింది. టాప్-10లో భారత్ తరపున ఉన్న ఏకైక బౌలర్ ఆమెనే. ఆష్లీ గార్డ్నర్ నంబర్వన్ బౌలర్ గా కొనసాగుతోంది. హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), అనాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా), మరిజేన్ కాప్ (సౌతాఫ్రికా), అమేలియా కెర్ (న్యూజిలాండ్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ నెంబర్ వన్ ఆల్ రౌండ్ గా కొనసాగుతోంది. ఆల్ రౌండర్ ల లిస్టులో దీప్తి శర్మ 4వ ర్యాంక్ లో నిలిచింది.