టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు భారత్ దూసుకెళ్లింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సూపర్ 8 లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. రోస్టన్ ఛేజ్ 40 (25; 5×4, 1×6), జేసన్ హోల్డర్ 37 నాటౌట్ (22; 2×4, 3×6), రోవ్ మన్ పావెల్ 34 నాటౌట్ (19; 3×4, 2×6), షాయ్ హోప్ 32 (33; 3×4, 1×6), షిమ్రోన్ హెట్ మేయర్ 27 (12; 1×4, 2×6) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, హార్థిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.అనంతరం టార్గెట్ ఛేజింగ్ లో భారత్ అదరగొట్టింది. ముఖ్యంగా సంజూ శాంసన్ 97 నాటౌట్ (50; 12×4, 4×6) కీలక ఇన్నింగ్స్ తో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ 10 (11; 2×4), తిలక్ వర్మ 27 (15; 4×4, 1×6) సూర్య కుమార్ యాదవ్ 18 (16; 1×4, 1×6), ఇషాన్ కిషన్ 10 (6; 2×4), హార్దిక్ పాండ్య 17 (14; 2×4) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో షామర్ జోసెఫ్ 2 వికెట్లు, జేసన్ హోల్డర్ 2 వికెట్లు, అకియల్ హోసేన్ 1 వికెట్ తీశారు. ఇక సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడనుంది.