ఘట్టమనేని కుటుంబం నుండి వస్తున్న మరో నట వారసుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. రష తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సి.అశ్వనీ దత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ ను మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు నటిస్తున్నట్లు తెలుపుతూ ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రలో ఇందులో కనిపించనున్నారు. మరోవైపు నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్యారడైజ్’ సినిమాలో శికంజ మాలిక్ గా వైవిధ్యమైన పాత్రతో అలరించనున్నారు.