టీ20 వరల్డ్ కప్ కు ముందు సిద్ది వినాయకుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు

Spread the love

టీ20 వరల్డ్ కప్ నేటి నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన మొదటి మ్యాచ్ లో ముంబై లోని  వాంఖడే స్టేడియం వేదికగా యూ.ఎస్.ఏ తో తలపడనుంది. 2026 టైటిల్‌ ను డిఫెండ్ చేసుకునేందుకు టీమిండియా రెడీ అవుతోంది. కాగా,  ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మరికొందరు సహాయక సిబ్బందితో కలిసి ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు యూఎస్‌ఏతో జరగనున్న తమ తొలి మ్యాచ్‌కు ముందు వారు ఈ ఆలయ దర్శనం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత స్పిన్ దళంలో కీలకమైన కుల్దీప్ యాద‌వ్‌, వరుణ్ చక్రవర్తి ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టైటిల్ నిలబెట్టుకునే ప్రయాణంలో యూఎస్‌ఏపై విజయంతో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. భారత్-శ్రీలంకలు ఈ టీ 20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. మార్చి 8 వరకు టీ 20 క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది.