ఐపీఎల్ 2026:చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

Spread the love

చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ను  భారీ ఓటమితో మొదలెట్టగా…రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘనంగా ఆరంభించింది. ఐపీఎల్ సీజన్-19లో భాగంగా గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ 43 (36; 2×4, 2×6) టాప్ స్కోరర్. కార్తీక్ శర్మ (18), సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండెంకెల స్కోర్లు చేశారు. స్టార్ బ్యాటర్లు సంజూ శాంసన్ (6), రుతురాజ్ గైక్వాడ్ (6), శివమ్ దూబే (6) ఘోరంగా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాన్ద్రే బర్జర్  వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు చొప్పున  పడగొట్టారు. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో రాజస్థాన్ దుమ్మురేపింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 52 (17; 4×4, 5×6) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెన్నై బౌలింగ్ ను చీల్చిచెండాడు. యాశస్వీ జైశ్వాల్ 38 నాటౌట్ (36; 3×4, 1×6) కూడా ఆకట్టుకున్నాడు. ఇక ధ్రువ్ జురెల్ (18), రియాన్ పరాగ్ (14 నాటౌట్) పరుగులు చేయడంతో రాజస్థాన్ 12.1ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 128 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 8 వికెట్ల తేడాతో మ్యాచ్ ను కైవసం చేసుకుని పాయింట్ల ఖాతా తెరిచింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *