తన అసామాన్య ప్రతిభతో ఆర్చరీలో ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకోడమే కాక మంచి ప్రదర్శనతో రాణిస్తున్న ఆర్చర్ శీతల్ దేవికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. జమ్ముకశ్మీర్ కు చెందిన ఈ టాలెంటెడ్ ఆర్చర్ వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ 2025 సంవత్సరానికి బెస్ట్ పారా ఆర్చర్ గా ఎంపిక చేసింది. 19 ఏళ్ల శీతల్ గత ఏడాదిసౌత్ కొరియాలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచింది. ఈ టోర్నీలో మహిళల టీమ్ విభాగంలో రజతం, మిక్స్డ్ టీమ్ లో కాంస్యం కూడా గెలుచుకుంది. ఆమె 2024 పారిస్ పారాలింపిక్స్ లో మిక్స్డ్ టీమ్ కాంస్యం సాధించింది. చేతుల్లేకుండా ఆర్చరీలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన మొదటి క్రీడాకారిణిగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ప్రపంచ అత్యుత్తమ పారా ఆర్చర్లతో పాటుగా తన పేరును నామినేట్ చేయడం ఇప్పుడు ఈ పురస్కారం దక్కడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. నా హృదయం కృతజ్ఞత, ఉద్వేగంతో నిండిపోయింది. ధన్యవాదాలని శీతల్ పేర్కొంది.