ఈనెల 28 నుండి ఐపీఎల్ మెగా క్రికెట్ లీగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ప్రతి ఐపీఎల్ మ్యాచ్ లో 11 సీట్లను రిజర్వ్ చేయనున్నారు. బెంగళూరు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా గతేడాది జరిగిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మరణించారు. వారి జ్ఞాపకార్థం ఈ సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నారు. జూన్ 2025లో జరిగిన ఈ దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అభిమానుల జ్ఞాపకార్థం చిన్నస్వామి స్టేడియం 11 సీట్లను శాశ్వతంగా రిజర్వ్ చేయనుంది. భవిష్యత్తులో జరిగే అన్ని మ్యాచ్ లకు ఈ సీట్లను విక్రయించకుండా, గౌరవ సూచికంగా కేటాయించి ఉంచుతారు. ఇక స్టేడియం లోపలి ప్రవేశ ద్వారం వద్ద ఒక స్మారక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇక గత ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల 18ఏళ్ల కలను సాకారం చేస్తూ టైటిల్ విన్నర్ గా అవతరించింది. “ఈ సారి కప్పు మనదే” (Ee Sala Cup Namde) అనే స్లోగన్ ను జస్టిఫై చేస్తూ ఆ టీమ్ ఐపీఎల్ విన్నర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. అన్ని ఐపీఎల్ లలో నిరాశగా వెనుదిరిగిన ఆ జట్టు పట్టు వదలకుండా పోరాడి టైటిల్ విజేతగా నిలిచి తమ టీమ్ అభిమానుల డ్రీమ్ నెరవేర్చింది.