అలా మతం మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు:సుప్రీం కోర్టు 

Spread the love

క్రైస్తవం లోనికి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం స్పష్టం చేసింది. హిందువులు, సిక్కులు, బౌద్దులు మాత్రమే ఆ హక్కును పొందుతారని తెలిపింది. మతం మారిన తరువాత పెట్టే అట్రాసిటీ యాక్ట్ కేసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు జారీ చేసింది. ఇక ఈ అంశంలో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం సమర్ధించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చింతాడ అనిల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టి నేడు ఫైనల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎలాంటి పర్మిషన్ లేకుండా చర్చిని నిర్వహించడంపై అక్కల రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ రామిరెడ్డితో పాటు స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తి హిందూ షెడ్యూల్  కులాలకు చెందడని అట్రాసిటీ యాక్ట్ లోని సెక్షన్లు ఆ వ్యక్తికి వర్తించవని ఫిర్యాదు చట్టవ్యతిరేకమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  రామిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదని హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారికి మాత్రమే ఎస్సీ హక్కులు పొందే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆనంద్ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై సుప్రీం జడ్జిలు జస్టిస్ పీ.కే.మిశ్రా, జస్టిస్ అంజారియా ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా, ఏపీ హైకోర్టు తీర్పును సమర్ధించింది. మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *