విజయ్ హజారే ట్రోఫీ:సెమీస్ చేరిన కర్ణాటక,సౌరాష్ట్ర

Spread the love

విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక, సౌరాష్ట్ర సెమీ ఫైనల్ చేరాయి. అద్భుత ఫామ్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ (81 నాటౌట్; 95 బాల్స్ లో 11×4) మరోసారి మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో  కర్ణాటక సెమీస్ చేరింది. ఇక మరో క్వార్టర్స్ లో అజేయ సెంచరీతో కెప్టెన్ హార్విక్ దేశాయ్ (100 నాటౌట్; 116 బంతుల్లో 8×4, 2×6) సౌరాష్ట్రను విజయతీరాలకు చేర్చాడు.  కర్ణాటక వీజేడీ పద్ధతిలో 55 పరుగుల తేడాతో ముంబయిపై గెలిచింది. ముంబయి ముందుగా బ్యాటింగ్  చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు చేసింది. షామ్స్ ములాని (86) టాప్ స్కోరర్. ఛేజింగ్ లో  ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పడిక్కల్, కరుణ్ (74 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కర్ణాటక 33 ఓవర్లలో 187/1తో ఉన్నప్పుడు మ్యాచ్కు వర్షం అడ్డుపడింది. మ్యాచ్ తిరిగి సాధ్యం కాకపోవడంతో వీజేడీ పద్ధతిలో విజేతను ప్రకటించారు. అప్పటికి కర్ణాటక 55 పరుగులు ముందంజలో ఉంది. సౌరాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మధ్య మ్యాచ్ ఫలితం కూడా వీజేడీ పద్ధతిలోనే తేలింది. మొదట ఉత్తరప్రదేశ్ 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ గోస్వామి (88), సమీర్ రిజ్వి (88 నాటౌట్) రాణించారు. కెప్టెన్ రింకు సింగ్ (13) ఆకట్టుకోలేదు. చేతన్ సకారియా 3, ప్రేరక్ మన్కడ్ రెండు వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో హార్విక్ కు  తోడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మన్కడ్ (67) జట్టును విజయాన్ని అందించారు.  అయితే సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 238/3తో ఉండగా మొదలైన వర్షం మళ్లీ మ్యాచ్ ను  సాగనివ్వలేదు. వీజేడీ పద్ధతిలో ఆ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.