డబ్ల్యూపీఎల్:ముంబైపై గుజరాత్ జెయింట్స్ గెలుపు

Spread the love

డబ్ల్యూపీఎల్ ఈ సీజన్ లో గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయింది. తాజాగా ముంబై ఇండియన్స్ పై 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఎలిమినేటర్ కు అర్హత సాధించింది. 8 మ్యాచ్ లలో 5గెలుపులతో ఆ టీమ్ 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 167  పరుగులు చేసింది. ఆష్లీ గార్డ్ నర్ 46 (28; 7×4, 1×6),జార్జియా వేర్ హామ్ 44నాటౌట్ (26; 4×4, 2×6), సోఫీ డివైన్ 25(21; 3×4) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో ఆమెలియా కెర్ 2 వికెట్లు, షబ్నిమ్ ఇస్మాయిల్ ఒక వికెట్ తీశారు. టార్గెట్ ఛేజింగ్ లో ముంబై తడబడింది. సోఫీ డివైన్ 2 వికెట్లు పడగొట్టింది. ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ 82 నాటౌట్, సజీవన్ సాజనా 26, అమీలియా కెర్ 20 పరుగులు చేశారు.