ఈ సీజన్ మిగతా మ్యాచ్ లకు ఆయుష్ మాత్రే దూరం

Spread the love

ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు ఆయుష్ మాత్రే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో 177.87 స్ట్రైక్ రేటుతో 201 పరుగులుచేశాడు.అయితే అతను  మిగిలిన మ్యాచ్ లకు యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే దూరమైనట్లు ఆ జట్టు  యాజమాన్యం తెలిపింది. ఈ నెల 18న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో  బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయమైనట్లు తెలిపింది. ఎడమ తొడ కండరాల గాయం నుంచి కోలుకునేందుకు 6-12 వారాల సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో ఈ సీజన్ లోని  మిగిలిన మ్యాచ్లకు దూరమైనట్లు తెలిపింది. అతడు త్వరగా పూర్తిగా  కోలుకోవాలని ఆకాంక్షించింది. ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడి అందులో రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.  ఇప్పటికే ఖలీల్ ఆహ్మద్ వంటి ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైన నేపథ్యంలో.. ఆయుష్ కూడా మిగతా మ్యాచ్ లకు అందబుబాటులో లేకపోవడాన్ని జట్టు ఏవిధంగా అధిగమిస్తుందో చూడాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *