చైనీస్ గ్రాండ్ ఫార్ములా వన్ రేసులో సత్తా చాటిన కిమి ఆంటోనెలి

Spread the love

ఇటలీకి చెందిన కిమి ఆంటోనెలి చైనీస్ గ్రాండ్ ఫార్ములా వన్ రేసులో సత్తా చాటాడు. ఫైనల్లో ఈ మెర్సిడెజ్ డ్రైవర్ తోటి రేసర్ జార్జ్ రసెల్ ను అధిగమించి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. 56 ల్యాప్ ఫైనల్ లో  పోల్ పొజిషన్ నుండి  రేసు బిగిన్ చేసిన ఆంటోనెలి (1 గంట 330.15 సెకన్లు).. నెంబర్ వన్ గా పూర్తి చేశాడు. 19 ఏళ్ల ఆంటోనెలికి కెరీర్ లో ఇదే మొదటి  గ్రాండ్ టైటిల్. ఫార్ములావన్ చరిత్రలో గ్రాండ్ టైటిల్ సాధించిన రెండో చిన్న వయసు వ్యక్తిగా  ఆంటోనెలి సరికొత్త రికార్డు సాధించాడు. ఈ లిస్టులో మ్యాక్స్ వెర్స్టాపెన్ (18 ఏళ్లు) ముందంజలో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి జోరుమీదున్న జార్జ్ రసెల్ (1 గంట 38ని. 66 సె) చైనీస్ గ్రాండ్లో రెండో స్థానంలో నిలిచాడు. చాలా రోజుల తర్వాత లూయిస్ హామిల్టన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 58ని. 41 సె) కూడా పర్వాలేదనిపించాడు. ఈ ఫెరారీ స్టార్ మూడో స్థానాన్నికైవసం చేసుకున్నాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *