భారత్ లోనే ఇంకా ఆ రెండు టీమ్ లు

Spread the love

టీ 20 వరల్డ్ కప్ కోసం భారత్ లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు ఇంకా తమ స్వదేశానికి చేరుకోలేదు. భారత్ తో ఈ టోర్నీలో ఆఖరి మ్యాచ్ ఆడిన వెస్టిండీస్ కీలకమైన ఆ మ్యాచ్ లో పరాజయంతో టోర్నీ నుండి నిష్క్రమించింది. అనంతరం  భారత్ నుండి వారు తమ స్వదేశానికి పయనమవ్వాల్సి ఉంది. అయితే అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సర్వీసెస్ లో అంతరాయమే దీనికి కారణంగా తెలుస్తోంది. తమ టీమ్ ప్లేయర్ల సెక్యూరిటీ కోసం తాము ఐసీసీ, సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలసి పనిచేస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఆ ప్రభావం గల్ఫ్ దేశాలపైనా పడిన విషయం తెలిసిందే. గల్ఫ్ ప్రాంతాల్లో పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దయ్యాయి. సెక్యూరిటీ రీజన్స్ వలన ముందుగా షెడ్యూల్ చేసిన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. మరోవైపు జింబాబ్వే జట్టు పరిస్థితి కూడా అంతే. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ముగించుకున్న తర్వాత, జింబాబ్వే సీనియర్ పురుషుల జట్టు భారత్‌ లో సురక్షితంగా ఉందని జింబాబ్వే క్రికెట్ (ZC) ధృవీకరించింది. ఆ జట్టు దుబాయ్ మీదుగా స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితుల వల్ల కీలకమైన రవాణా మార్గాలకు అంతరాయం కలగడంతో వారి ప్రయాణ ప్రణాళికలు ప్రభావితమయ్యాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రత్యామ్నాయ చర్యలను ప్రారంభించింది. జట్టు తిరిగి రావడానికి ఇతర విమాన మార్గాలను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిసి పని చేస్తోంది. జట్టు సురక్షితంగా, సకాలంలో తిరిగి వచ్చేలా చూడడానికి జింబాబ్వే క్రికెట్ నిరంతరం ఐసీసీ (ICC) మరియు అక్కడి టీమ్ మేనేజ్‌మెంట్‌తో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *