కొత్త సంవత్సరం మొదటి రోజైన నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ముగించాయి. దేశీయ, అంతర్జాతీయంగా బలమైన సానుకూల సంకేతాలు కొరవడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ ఉదయం 85,255.55 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభనష్టాల మధ్య ఓ మోస్తరుగా కదలాడింది. ఆఖరికి 32 పాయింట్ల నష్టంతో 85,188.60 వద్ద స్థిరపడింది. స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 16.95 పాయింట్ల లాభంతో 26,146.55 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 89.98గా ఉంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఎన్టీపీసీ, ఎటెర్నల్, ఏషియన్ పెయింట్స్, బీఈఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి.