ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి..!

Spread the love

Check your PF balance easily: మొన్నటివరకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేస్కోవడం కోసం పీఎఫ్ యూఏఎన్ నంబర్ తో లాగిన్ అయి, మళ్ళీ పాస్ బుక్ లాగిన్ అవ్వడం లాంటి మెథడ్స్ ఫాలో అవ్వాల్సి ఉండేది. కానీ ఇకపై ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాస్ బుక్ ను డౌన్ లోడ్ చేసుకోవడాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయిన EPFO మరింత ఈజీ చేసేసింది. ఇందుకోసం డిజిలాకర్ యాప్ లో (DigiLocker) ఈపీఎఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్కడినుంచైనా తమ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్ బుక్, ఇతర డాక్యుమెంట్ లను యాక్సెస్ చేయొచ్చు అంటూ ఈపీఎఫ్ఓ ఎక్స్ లో ఇటీవల పోస్ట్ పెట్టింది.

ఇందుకోసం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ముందుగా డిజిలాకర్ యాప్ డౌన్లోడ్ చేసి పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, పాస్ బుక్ ను డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాదు యూఏఎన్ కార్డు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, స్కీమ్ సర్టిఫికేట్ వంటివీ డిజిలాకర్ ద్వారా పొందొచ్చు. Check your PF balance easily.

అసలుకైతే పాస్ బుక్ డౌన్లోడ్ సదుపాయం నిన్నటిదాకా ఉమాంగ్ యాప్ లో ఉండేది. ఇకపై డిజి లాకర్ లోను దీనిని యూస్ చేసుకోవచ్చన్నమాట. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఓఎస్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది.

మరోవైపు పీఎఫ్ కు సంబంధించిన సేవలు ఉమాంగ్ యాప్ తో పాటు పీఎఫ్ పోర్టల్ లో కూడా లభిస్తాయి. కేవలం మీ బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వివరాలు పొందొచ్చు. ఎస్సెమ్మెస్ రూపంలో యూఏఎన్ తో లింక్ అయిన మొబైల్ నుంచి 7738299899 నంబరు EPFOHO UAN’ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ను మీరు తెలుసుకోవచ్చు.

Also Read: https://mega9tv.com/technology/have-you-heard-of-doom-scrolling-check-how-people-are-mad-for-it/