
YouTube Introduces Image to Video: మీరు రెగ్యులర్ గా యూట్యూబ్ షార్ట్స్ చేస్తుంటారా? అయితే, ఈ కొత్త అప్డేట్ మీకోసమే.. కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొన్ని సూపర్ జనరేటివ్ ఏఐ టూల్స్‌ను తీసుకొచ్చింది. వీటితో ఇక వీడియోలు తయారు చేయడం, వాటిని మరింత అట్రాక్టీవ్ గా మార్చడం మీకు చిటికెలో పనవుతుంది.
సింపుల్‌గా చెప్పాలంటే.. మీ ఫొటోలే వీడియోలుగా మారుతాయన్నమాట! ఇందుకోసం ‘Image-to-Video’ టూల్ ఉంది. దీంతో ఫోన్లోని ఏ ఫొటోనైనా ఆరు సెకన్ల యానిమేటెడ్ వీడియోగా మార్చేయొచ్చు.
ఏం చేయాలంటే.. ముందుగా ఫొటోని సెలెక్ట్ చేసుకుని.. యూట్యూబ్ ఇచ్చే కొన్ని క్రియేటివ్ ఐడియాల నుంచి మీకు నచ్చిన ఐడియాతో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కొన్ని సెకన్ల వ్యవధిలో వీడియో ఇట్టే రెడీ అయిపోతుంది.
గూగుల్ అత్యాధునిక ‘Veo 2’ వీడియో జనరేషన్ మోడల్ ఈ ఫీచర్ కోసం పని చేస్తుంది. మన చుట్టూ ఉండే మంచి ప్లేసెస్ సినరీ లేదా వ్యూ, గ్రూప్ ఫొటోస్, రోజువారీ ఫొటోలను ఈజీగా వీడియోలుగా మార్చడానికి ఇది బెటర్ గా యూస్ అవుతుంది. షార్ట్స్ కెమెరాలో ఇప్పుడు కొత్తగా ‘Effects’ ఐకాన్‌లో ‘AI’ అనే కొత్త ట్యాబ్ కనిపిస్తుంది.
దీని ద్వారా క్రియేటర్లు ఈ సరికొత్త ఏఐ ఎఫెక్ట్‌లను ఉపయోగించవచ్చు. డ్రా చేసిన బొమ్మలను కూడా అద్భుతమైన క్రియేటివ్ పోస్టర్లుగా మార్చేయొచ్చు. YouTube Introduces Image to Video.
మీలాగే కనిపించే డూప్లికేట్ పాత్రలతో ‘twinning’ వీడియోలను క్రియేట్ చేయొచ్చు.
ఇలా ఏఐ ద్వారా తయారైన కంటెంట్‌పై వాటర్ మార్క్‌లు జెనరేట్ అవుతాయి. అంటే ఒరిజినల్ కాదని.. ఇది ఏఐతో తయారైందని చెప్పడానికే ఈ ఏర్పాటన్నమాట! అలాగే, ఏఐ ప్లే గ్రౌండ్ ఆప్షన్ని కూడా వాడుకోవచ్చు. ఈ కొత్త ఏఐ టూల్స్‌తో… యూట్యూబ్ షార్ట్స్ క్రియేటర్లు తమ వీడియోలను మరింత ఆట్రాక్టివ్ అండ్ అటెన్షన్ పెంచేలా మార్చేయొచ్చు. సో మీరూ ట్రై చేసేయండి!