పార్లమెంట్ తరహాలో తెలంగాణ శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. సభ్యుల గౌరవం పెంచేదిగా ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని సీఎం కీలక ఆదేశాలిచ్చారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులకు ప్రైవసీ ఉండాలని స్పష్టం చేశారు. గతంలో నిర్ణయించిన మేరకు పార్లమెంట్ తరహాలో సభ్యులకు సెంట్రల్ హాలును వచ్చే సమావేశాల నాటికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సభ్యుల కోసం ప్రత్యేకంగా మెంబర్స్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయాలని, ప్రస్తుత శాసనసభ, పాత మండలి భవనాల వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. సభ్యుల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం అవసరమైన ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. శాసనసభ ప్రాంగణంలో భద్రతను కూడా మరింత పటిష్టం చేయాలని పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పాల్గొన్నారు.