హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ ఆఫీస్ ..ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

ఈరోజు హైదరాబాద్‌లో ‘నెట్‌ఫ్లిక్స్ ఐలైన్’ కార్యాలయాన్నిసీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  తెలంగాణ ప్రభుత్వం మరియు మన రాష్ట్ర ప్రజల తరపున, నెట్‌ఫ్లిక్స్ మరియు ఐలైన్ సంస్థలకు స్వాగతం పలికారు.  హైదరాబాద్ నగర వృద్ధి మరియు అభివృద్ధిలో ఈరోజు మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలకు ఈ నగరం  అత్యంత ఇష్టపడే గమ్యస్థానంగా మారుతున్న క్రమంలో, మరో ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ ను ఇక్కడకు ఆహ్వానించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యాలయం ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్  సినిమా రంగానికి హైదరాబాద్‌ ను ఒక శక్తివంతమైన మరియు సాదరమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే తన ప్రధాన ఆశయమని పేర్కొన్నారు.  నెట్‌ఫ్లిక్స్ రాకతో ఆ విజన్ క్రమంగా వాస్తవ రూపం దాల్చుతోందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్త వైవిధ్యభరిత సంస్కృతులను మరియు సంప్రదాయాలను గౌరవిస్తూనే, అంతర్జాతీయ స్థాయి సంస్థలకు హైదరాబాద్ ఒక గొప్ప వేదికగా ఎదిగిందన్నారు. డీవీడీ రెంటల్ సర్వీస్‌గా మొదలై, నేడు ఓటీటీ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదిగిన నెట్‌ఫ్లిక్స్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. ఇది వారి దూరదృష్టికి మరియు ఆవిష్కరణల శక్తికి నిదర్శనమని కొనియాడారు. హైదరాబాద్‌లో వారి ప్రయాణం అద్భుతమైన విజయాలతో సాగాలని ఆకాంక్షించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *