
Congress Second Schedule Janahita Padayatra: తెలంగాణ కాంగ్రెస్ చేపట్టే రెండో విడత జనహిత పాదయాత్ర ఉన్నట్లా లేనట్లా? ఢిల్లి వెళ్లిన వారు ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు. జనహిత పాదయాత్ర పీసీసీ నిర్ణయమా, రాష్ట్ర ఇంచార్జి నిర్ణయమా. ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయరన్న పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది.
నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెల్సుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర చేపట్టింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి నాలుగో తేదీ వరకు నాలుగు రోజులు మొదటి విడతగా ఈ పాదయాత్రను చేపట్టారు. ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఆదిలోనే హంస పాదం అన్నట్టుగా ముందు నిర్ణయించిన తేదీలు కాకుండా షెడ్యూల్ చేంజ్ చేశారు. దీంతో తేదీలను ఎవరు ఫిక్స్ చేశారు, ఆ తర్వాత ఎవరు మార్చరన్న అంశంపై ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోందట.
ఇంచార్జి మీదనాక్షి నటరాజ్ పాదయాత్ర అంటూ పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర అంటూ ప్రచారం చేశారు. దీంతో కేడర్ పరిస్తితి ప్రశ్నార్థకంగా మారిందట. ఇక కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ నేపద్యంలోనే జనహిత పాదయాత్ర విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించలేదట. కేవలం టీపీసీసీ నేత, మీనాక్షి నటరాజన్ కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓవైపు ప్రభుత్వ పరంగా ఢిల్లీలో ధర్నా ఉన్న సమయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పాదయాత్ర షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓ దశలో అసహనం వ్యక్తం చేశారట. Congress Second Schedule Janahita Padayatra.
రెండు రోజుల క్రితం గాంధీ భవన్ లో జరిగిన చిట్ చాట్ లో పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనహిత పాదయాత్ర ఇంచార్జిది కాదంటూనే, ఆ ప్రోగ్రాం పూర్తిగా పీసీసీ చేపట్టేది అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, తనకు సీఎం మధ్య గ్యాప్ ఉన్నట్లు కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇదే సమయంలో త్వరలోనే రెండవ విడత పాదయాత్ర ఉంటుందన్న ఆయన, ఈ యాత్రలో సీఎం పాల్గొంటారని చెబుతూనే, ఇంచార్జి మీనాక్ష నటరాజన్ వస్తారా అన్న ప్రశ్నకు క్లారిటీ ఇవ్వలేదట.