చరిత్ర లో చిరస్మరనీయంగా ‘పింగళి వెంకయ్య’ పేరు!

Spread the love

Nadigudem Fort Nalgonda District: మువ్వన్నెల త్రివర్ణ పతాకానికి” సగర్వంగా సెల్యూట్ చేస్తుంటే ప్రతి భారతీయుని గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగుతుంది. భిన్న సంస్కృతులను ఏకం చేస్తూ, దేశ కీర్తి ని ఆ మూడు రంగుల్లో ప్రతిబింబించేలా ఒక రూపం ఇచ్చి, మన ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు – పింగళి వెంకయ్య,..ఆయన మన ‘మువ్వన్నెల జాతీయ జెండా’ కు రూప కల్పన చేసింది నల్గొండ జిల్లా లోని ఈ రాజా వారి కోట లోనే..గాంధీజీ తో ఆ చిరస్మరణీయ ప్రయాణం సాగింది. ఈ నడిగూడెం కోట నుండే ప్రతి భారతీయని గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ‘జాతీయ జెండా’..తయారీ కి బీజం పడి ఇప్పటికే వందేళ్లు దాటింది.

“1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ లోని ‘భటల పెన్నుమర్రు’లో పింగళి వెంకయ్య జన్మించారు. చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, విజ్ఞానపిపాస ఆయనలో గాఢంగా ఉండేవి. సైన్యంలో పనిచేసి, ప్రపంచం చుట్టివచ్చినా, మన దేశం కోసం ఏదో ప్రత్యేకంగా చేయాలనే తపన ఆయన్ని విడిచిపెట్టలేదు. 1916లోనే జాతీయ పతాకంపై ఆయన పరిశోధన మొదలుపెట్టారు. వివిధ దేశాల జెండాలను అధ్యయనం చేసి, 1921లో విజయవాడ కాంగ్రెస్ మహాసభలో గాంధీకి ఒక జెండా రూపకల్పన సమర్పించారు. మొదటగా ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఉన్న జెండాకు, తరువాత గాంధీజీ సూచనతో మధ్యలో తెల్లటి గీత మరియు చరఖా జోడించబడ్డాయి. ఈ జెండా, స్వాతంత్ర ఉద్యమంలో లక్షల మందికి ప్రేరణగా మారింది.

అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా గూడెం రాజా వారి కోటలోనే మన జాతీయ జెండా కు పింగళి వెంకయ్య చేతిలో రూప కల్పన జరిగింది. అప్పటి జమిందారు కోటలో వ్యవసాయ అధికారిగా పని చేసిన పింగళి వెంకయ్య “స్వదేశీ ఉద్యమం, ఖాదీని ప్రోత్సహించడం, యువతలో జాతీయ భావజాలాన్ని నింపడం – ఇవన్నీ పింగళి వెంకయ్య జీవిత ధ్యేయంగా పని చేశారు. దేశం కోసం అన్నీ అర్పించి, చివరి దశలోనూ నిరాడంబరంగానే జీవించారు.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, వెంకయ్య రూపొందించిన జెండాకు తుది మెరుగులు దిద్దారు. ఎరుపు రంగును త్యాగానికి ప్రతీకగా కాషాయ రంగులోకి, మధ్యలోని చరఖాను ధర్మానికి ప్రతీకగా అశోక చక్రంగా మార్చారు. త్రివర్ణ పతాకం రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం. ఆయనకు ఇచ్చిన గొప్ప బహుమానం – ఆయన రూపకల్పన చేసిన జెండా నేటికీ గర్వంగా ఎగురుతోంది. Nadigudem Fort Nalgonda District.

నడిగూడెం కోట – శతాబ్దాల చరిత్రకు ఇప్పటికీ మూగసాక్షిగా నిలుస్తుంది. సురభి నాయక రాజుల రక్షణ స్థావరంగా, వ్యూహాత్మక కేంద్రంగా నిలిచిన ఈ కోట, తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది. ఈ చారిత్రక ప్రదేశం దేశభక్తికి చిహ్నమైన ‘జాతీయ పతాకం’ రూపు దిద్దుకోవడానికి వేదిక అయ్యింది. ఇక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం – స్థానిక చరిత్రకు, జాతీయ స్వాతంత్ర్య స్ఫూర్తికీ కలయికగా భావించాలి.

Also Read: https://mega9tv.com/telangana/driverless-buses-have-arrived-in-hyderabad/