మద్యం కుంభకోణంలో కోర్టు తీర్పు నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు. మద్యం కుంభకోణం అనే సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం బీ.ఆర్.ఎస్. కవిత గారికి ఈరోజు కోర్టులో న్యాయం జరిగింది. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని మరియు కల్పితమని త్వరలోనే తేలిపోతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. సత్యం గెలిచే వరకు, కాంగ్రెస్ మరియు బీజేపీలు చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను మనం చూశాం. అసత్య పూరిత కుట్రపూరిత కేసులను ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ, సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యతనిస్తూ, న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ‘నవ భారతం’లో అలవాటుగా మారిపోయిందని అయితే చివరికి న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు.