నా జీవితంలో సంపాదించుకున్నది కేవలం నా నిజాయితీ మాత్రమే:అరవింద్ కేజ్రీవాల్

Spread the love

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఎంపీ కవితలకు భారీ ఊరట లభించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు సత్యం గెలిచింది.మద్యం కుంభకోణం యొక్క అసలు నిజం ఈరోజు కోర్టు ద్వారా వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి అతిపెద్ద కుట్ర పన్నారని ఆరోపించారు.  ఈరోజు కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మరియు ఆప్ (AAP) అవినీతిపరులు కాదని తేల్చి చెప్పింది. నేను నా జీవితంలో సంపాదించుకున్నది కేవలం  నిజాయితీ మాత్రమేనని కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ కేసు విషయంలో కోర్టు తీర్పుపై ఆప్ శ్రేణులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ కుటుంబసభ్యులు సైతం భావోద్వేగంతో హర్షం వ్యక్తం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *