
Kamareddy Floods: కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటిలేదని బీఆర్‌ఎస్ పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు. బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు. అక్కడి నుంచి స్థానిక నాయకుల వాహనాలలో రాజాపేటకు బయలుదేరి వెళ్లారు. ఇక జలదిగ్బంధంలో రాజాపేట, ధూప్ సింగ్ తండా వాసులను పరామర్శింస్తున్నారు.

మెదక్, కామారెడ్డి జిల్లాలో వరదలు వచ్చి ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆటల, మూసీ సుందరీకరణ పై రివ్యూలు పెడుతున్నాడే కానీ ప్రజలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం రాజీపేటలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి పరామర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే రాజీపేటకు చెందిన యాద గౌడ్, సత్యనారాయణలు మృతి చెందారన్నారు. హాస్టల్‌లో నీళ్ళు వస్తుంటాయని ఫోన్ వస్తే పిల్లలను తీసుకు వచ్చేందుకు ఆటోలో వెళ్తున్న క్రమంలో ఇద్దరు వరదలో చిక్కుకొని ప్రాణాలతో కొట్టు మిట్టడడారని అన్నారు. స్తంభం పై నాలుగు గంటలు ఉండి కాపాడాలి కోరిన రక్షించలేదన్నారు. సకాలంలో హెలికాప్టర్ పంపి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవన్నారు. Kamareddy Floods.
ఒక మంత్రి అయితే తక్షణం హెలికాప్టర్ వాడమని చెబుతున్నారని, పెళ్లిళ్లకు, ముఖ్యమంత్రి ఇతర పనులకు వాడొచ్చు కాని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, వారికి తక్షణమే రూ 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హవేలీ ఘనపూర్ మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ లేక, నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు అధికార యంత్రాంగం తీసుకునేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 25 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q