అర్ధరాత్రి బాత్‌రూం గోడకు కన్నం వేసి భారీ చోరీ..!

Spread the love

Massive Gold Robbery At Suryapet: సూర్యాపేటలో భారీ దొంగతనం జరిగింది. శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాపులో అర్ధరాత్రి గుర్తు తెలియదని దుండగులు షాప్ లోకి ప్రవేశించి భారీ చోరీకి పాల్పడ్డారు. ఉదయం షాప్ ఓపెన్ చేయగానే చోరీ జరిగిన తీరు చూసి ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

దాదాపు 15 నుంచి 18 కేజీల బంగారం దోచుకెళ్లినట్లు సమాచారం .విషయం తెలుసుకున్న పోలీసులు షాప్ దగ్గరకు చేరుకుని చోరీ జరిిన తీరును పరిశీలించారు. షాప్ వెనుకవైపు నుంచి బాత్రూం గోడకు కన్నం వేసిన దొంగ షాప్ లోకి ఎంటర్ అయినట్లు గుర్తించారు. గ్యాస్ కట్టర్ తో షట్టర్ కట్ చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Massive Gold Robbery At Suryapet.

Also Read: https://mega9tv.com/slideshow/cm-revanth-reddy-visits-secunderabad-ujjaini-mahankali-bonala-jathara-2025/