
Nalgonda Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామాల్లో ప్రజలు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల రణం మొదలైంది.ఈ ఎన్నికలు కేవలం గ్రామాలకే పరిమితం కాకుండా, రాబోయే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం. మూడు జిల్లాలు – నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిలో మున్సిపాలిటీ లు మినహా ఉన్న 58 మండలాలు,1782 గ్రామ పంచాయతీలు,15,586 వార్డులు ఈ ఎన్నికల కోసం సిద్ధమయ్యాయి.ప్రతి నియోజకవర్గంలో వేరువేరు సమీకరణాలు,రాజకీయ సమరాలు . కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు – ఎవరి బలం ఎంత? ఎవరి బలహీనతలు ఏమిటి? వాచ్ థిస్ మెగా 9 స్పెషల్ రిపోర్ట్..*
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పల్లె సమరానికి అర్హత” గల మొత్తం ఓటర్లు 23,00,480 మంది ఉన్నట్టు. మూడు జిల్లాల పరిధిలో డిపివో లు తుది జాబితా విడుదల చేశారు. వీరిలో పురుషులు 11,36,180 మంది కాగా, మహిళలు 11,64,300 ఉన్నారు.అంటే మహిళా ఓటర్లు పురుషుల కంటే 28,120 మంది ఎక్కువగా ఉన్నారు.ఈ మహిళా ఆధిక్యం ఈసారి పల్లె పంచాయితీ ఫలితాలను నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా నల్గొండ జిల్లాలో: 16,32,949 ఓటర్లు ఉండగా.. (మహిళలు 12,229 ఎక్కువ) సూర్యాపేట జిల్లాలో 6,94,749 ఓటర్లు (మహిళలు 13,263 ఎక్కువ)యాదాద్రి జిల్లాలో: 5,32,238 ఓటర్లు (మహిళలు 3,084 ఎక్కువ) ఉన్నారు.*
23,00,480 మంది ఓటర్లు
తుది జాబితా విడుదల
11,36,180 మంది పురుషులు
11,61,300 మంది మహిళలు
పురుషుల కంటే మహిళ ఓటర్లే ఎక్కువ
నల్గొండలో 16,32,949 ఓటర్లు
సూర్యాపేటలో 6,94,749 ఓటర్లు
యాదాద్రిలో 5,32,238 ఓటర్లు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం,ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11మంది ఎమ్మెల్యే లు ఇద్దరు ఎంపీలు ఆ పార్టీ కి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. మహాలక్ష్మి, గృహలక్ష్మి, రైతు భరోసా, రుణ మాఫీ, చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్ట్ ల పని తీరు, వంటి అంశాలు ఈ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో బలంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. నల్గొండ, సూర్యాపేట,యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ కు సాంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉంది. మరోవైపు అధికంగా ఉన్న మహిళా ఓటర్లలో మహాలక్ష్మి పథకం ప్రభావం పెద్ద చర్చగా మారింది. అయితే, స్థానిక నాయకుల మధ్య అంతర్గత విభేదాలు,అభ్యర్థుల ఎంపికలో గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ కు సవాలుగా మారనున్నాయి. ఇక’బీఆర్‌ఎస్ పార్టీ ని పరిశీలిస్తే గత దశాబ్దంలో చేసిన అభివృద్ధి పనులు – మిషన్ భగీరథ, పల్లెప్రగతి,రోడ్లు, సామాజిక భవనాలు – సంక్షేమ పథకాలు ఆ పార్టీకి బలంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం పంచాయితీలను ఛేజిక్కించుకున్న బిఆరెస్ కూ బలమైన కేడర్ నెట్‌వర్క్ గ్రామాల్లో ఇంకా చెక్కుచెదరలేదు.
నల్గొండ కాంగ్రెస్ లో వర్గపోరులో, సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, భువనగిరిలో ప్రభావశీల నేతల ఆధిపత్యం బీఆర్‌ఎస్ కు ఒక ప్లస్ పాయింట్ గా మారనుంది. అయితే, అధికారాన్ని కోల్పోవడం, ప్రజల్లో ప్రతికూల వాతావరణం, అలాగే కాంగ్రెస్ పథకాల ఆకర్షణ బీఆర్‌ఎస్ కు బలహీనతలుగా మారనున్నాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న మరో ప్రధాన జాతీయ పార్టీ “బీజేపీ” కి మునుగోడు, భువనగిరి, సూర్యాపేట నియోజకవర్గాలలో కొంత బలం ఉన్నా, మిగిలిన జిల్లాలో ఆ పార్టీ ప్రభావం పరిమితంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని మండలాల్లో కేడర్ చురుకుగా ఉన్నా జిల్లావ్యాప్తంగా ప్రభావం చూపడం కష్టంగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. కేంద్ర పథకాల హామీలు బలంగా క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి ప్రజల అభిమానం చూరగొనడంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు.పట్టణ ప్రాంతాల్లో బీజేపీ కికొంత పట్టున్నా , గ్రామీణ ఇమేజ్ ఇంకా తక్కువగానే ఉండడంతో మూడో స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో వామపక్ష పార్టీల ప్రభావం పరిమితంగా ఉండనుంది.CPI, CPM,రైతు, కూలీ సంఘాల ఆధిపత్యం ఉన్న మండలాల్లో, ముఖ్యంగా నల్గొండ, మిర్యాలగూడ, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో లెఫ్ట్ పార్టీల ఇంపాక్ట్ కొంత మేర ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇక ఇక్కడ వామ పక్షాలు ఈసారి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నియోజకవర్గాల వారిగా స్థానిక సమరానికి సిద్ధమవుతున్న ఆయా పార్టీల బలాలను, బలహీనతలను పరిశీలిస్తే మంత్రి ‘కోమటిరెడ్డి ఇలాఖా’ ‘నల్గొండ’లో కాంగ్రెస్ బలంగా ఉంది. బీఆర్‌ఎస్ గత ఫలితాలు, గ్రామీణ కేడర్ ఆధారంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ‘మునుగోడు’లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బిఆరెస్ నేత కూసుకుంట్ల కు మధ్య ద్విముక పోరు ఉంది. మునుగోడులో ఈ సారి పల్లె తీర్పులో గత ఎన్నికల ప్రభావంతో పాటు ,బీజేపీ, వామపక్షాల పాత్ర కీలకంగా మారనుంది. ‘నాగార్జునసాగర్’ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జానా రెడ్డి చరిస్మా తో పాటు బీసీ, రైతు ఓటు బ్యాంక్ బలంగా ఉంది కొన్ని మండలాలలో బిఆరెస్ ప్రభావం కూడా బలంగా ఉంది. ‘నకిరేకల్'(sc) కాంగ్రెస్ కు SC, BC ఓటర్లలో ఆధిపత్యం ఎక్కువగా ఉంది. బీఆర్‌ఎస్ గ్రూప్ వార్ కారణంగా స్థానికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇక చూస్తే ‘తుంగతుర్తి'(SC)లో కాంగ్రెస్ పథకాల బలం కలిసి వచ్చే అంశమైనప్పటికి సామెల్ తీరుతో మూడు భాగాలుగా కాంగ్రెస్ విడిపోయి ఉంది. దింతో అది బీఆర్‌ఎస్ కి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇక్కడ బిఆరెస్ కేడర్ గట్టి పోటీ ఇవ్వనుంది.’దేవరకొండ’ (ST) గిరిజన ఓటర్లలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్,లెఫ్ట్ పక్షాల ప్రభావంతో పల్లె పోరు రసవత్తరంగా ఉండనుంది. ‘భువనగిరి’ లో పట్టణ మహిళా ఓటు కాంగ్రెస్ వైపు ఉంది. బీఆర్‌ఎస్ స్థానిక నేతలపై కొంత వ్యతిరేక అభిప్రాయం ఉంది..’ఆలేరు లో ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిలయ్య ఎఫెక్ట్, ప్రభుత్వ పథకాలు, బీఆర్‌ఎస్ పల్లెల్లో కేడర్ బలం ప్రభావితం చేసే అవకాశం ఉంది.’
ఇక మరోవైపు కోదాడ’ లో బిఆరెస్ అవినీతి బాగోతం, బొల్లం ఒంటెద్దు పోకడ మంత్రి ఉత్తమ్ పద్మావతీ ప్రభావం పంచాయితీల గెలుపు పై ప్రభావం చూపనుంది.స్థానిక అసంతృప్తి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.’హుజుర్‌నగర్’లో మంత్రి ఉత్తమ్ ఇలాకా లో కాంగ్రెస్ బలంగా ఉంది. బీఆర్‌ఎస్ కి అక్కడ సరైన నాయకుడు లేక నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది.’సూర్యాపేట’ లో కాంగ్రెస్ బలంగా ఐనా సరే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు,బీజేపీ ద్వంద నీతి తో బిఆరెస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యూహాలు పలిస్తున్నాయనేది క్యాడర్ మాట.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలలో అధికంగా ఉన్న ‘మహిళా ఓటర్ల తీర్పు’ కీలకంగా మారనుంది.’ప్రభుత్వ పథకాల అమలు’ కూడా ముఖ్యంగా మహాలక్ష్మి, గృహలక్ష్మి, రైతు భరోసా పథకాల లబ్ధిదారుల ఓటు బ్యాంక్ గెలుపు,ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.’స్థానిక నాయకత్వం’సర్పంచ్, MPTC, ZPTC అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ మరి కొంత ఎఫెక్ట్ ఉండనుంది. కుల,వర్గ సమీకరణాలు’ ముఖ్యంగా బీసీ లు, రైతాంగం, మైనారిటీ ఓటు బ్యాంకు పల్లె తీర్పు ను తీవ్ర ప్రభావితం చేయనున్నాయి. ‘పార్టీల అంతర్గత కలహాలు’కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండింటికీ ఇది సవాలుగా మారనున్నాయి. Nalgonda Local Body Elections.
మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 23 లక్షల ఓటర్లు.. 58 మండలాలు.. 1782 పంచాయతీలు.. ఈసారి పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం ఫలితాలను నేరుగా ప్రభావితం చేయనుంది. కాంగ్రెస్ పథకాల ఆకర్షణ, బీఆర్‌ఎస్ కేడర్ బలం, బీజేపీ–వామపక్షాల పరిమిత ప్రభావం.. ఇవన్నీ కలిపి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలను కొన్ని గ్రామాలు హోరా హోరి పోరుకు సై అంటున్నాయి. చివరికి – ప్రతి గ్రామం తీర్పే, పార్టీల భవిష్యత్తుకు మార్గదర్శకం కానుంది.