
ఎమ్మెల్సీ కవిత కాంప్రమైజ్ అవుతారా…? కేసీఆర్ పంపిన దూతలు రంగంలోకి దిగాక రాజీకి మొగ్గు చూపినట్టేనా..? లేక కొత్త పార్టీ ఆలోచన కొనసాగిస్తారా…? కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారా..? అన్న కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు రావడంతో రేవంత్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ కవిత అడుగులు ఎటువైపు పడుతున్నాయి..?
తెలంగాణలో రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారబోతుంది. తన లేఖ ద్వారా సంచలనంగా మారిన ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా కొత్త అడుగు వేయబోతున్నట్టు తెలుస్తుంది.. ఇటీవల కవిత కొత్త పార్టీ పెట్టనున్నారని ప్రచారాలు వచ్చాయి. అయితే ఇప్పుడు కవిత కాంగ్రెస్ గూటికి చేరనుందంటూ ప్రచారం మొదలైంది. ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సంప్రదించారనే ప్రచారం హస్తం పార్టీలో కోడై కూస్తోంది.. ఇటీవల రెండు మూడు రోజులపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టి పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేశారు.. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్ఠానం అలాగే హస్తం పార్టీ పెద్దలు రేవంత్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు అంటున్నారు.. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళతాయని వారు భావించారట. ఈ అభిప్రాయంతో కాంగ్రెస్ అధి నాయకత్వం ఏకీభవించింది.. ఫలితంగా కాంగ్రెస్ లోకి ఇప్పటికిప్పుడు కవితకు ఎంట్రీ లేదనేది కొందరి టాక్.. స్పాట్ మ్యూజిక్
మరోవైపు కవిత జూన్ 2న కీలక ప్రకటనకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు సొంత బలం పెంచుకునేందుకు కవిత సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు.. తొలుత, గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై ఆమె దృష్టి సారించారు. ‘సింగరేణి జాగృతి’ సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కో- ఆర్డినేటర్లను నియమించారు. అదే విధంగా తాను సొంతంగా ఎదిగే క్రమంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులు.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ లతో సమావేశమయ్యారు. అనుబంధ సంఘాలను ప్రకటించడం, వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.. దీంతో.. కవిత జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారుతోంది.. ఇప్పటికే కవిత లేఖ.. ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారం కూడా పూర్తయింది.. ఈ నేపథ్యంలో సొంతంగా అడుగులు వేసే దిశగానే కవిత ముందుకు సాగుతున్నారనీ అర్థమవుతోంది…