మహిళలు మరియు చిన్నారుల భద్రతే లక్ష్యంగా స్పందన

Spread the love

హైదరాబాద్ వంటి మహానగరంలో మహిళలు మరియు చిన్నారుల భద్రతే లక్ష్యంగా స్పందన – ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లలో మొత్తం 14 ప్రత్యేక బృందాలను ఇందుకోసం సిద్ధం చేశారు. ఆపదలో ఉన్న మహిళలు తమ సమస్యలను మహిళా పోలీసుల వద్ద మరింత స్వేచ్ఛగా, నిర్భయంగా వ్యక్తపరచాలన్న  లక్ష్యంతో ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. డయల్-100 లేదా 112 కంట్రోల్ రూమ్‌కు అత్యవసర కాల్ రాగానే, ఈ ‘స్పందన’ టీమ్ లు  నిమిషాలలో ఆ ప్రదేశానికి చేరుకొని చేరుకుని బాధితులకు తక్షణ రక్షణ, వైద్య సాయం చట్టపరమైన భరోసా కల్పిస్తాయని తెలిపారు. డ్రైవర్‌తో సహా సిబ్బంది అంతా మహిళలే ఉండడం ఈ టీమ్ ల స్పెషాలిటీ. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, మెడికల్ కిట్స్ కలిగిన ప్రత్యేక పెట్రోలింగ్ వెహికల్స్ లో ఈ టీమ్ లు ఉదయం 10 నుండి  రాత్రి 12 గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సమయాల్లో స్పందించడమే కాకుండా, రద్దీ ప్రాంతాలు విద్యాసంస్థల్లో మహిళా భద్రతపై ఈ టీమ్ లు  విస్తృత అవగాహన కల్పించనున్నాయి. మహిళా రక్షణలో హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం తీసుకున్న ఈ ముందడుగు బాధితులకు కొండంత అండగా నిలవనుందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *