ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది

Spread the love

కార్మికుల చిరకాల స్వప్నం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు , అధికార ప్రతినిధులతో జూమ్ సమావేశం నిర్వహించారు. రెండు రోజుల సమ్మెలోనే పలుమార్లు ఆర్టీసీ కార్మికుల తో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.   కార్మిక సంఘాల ఎన్నికలు ,11 శాతం పీఆర్సీ ప్రకటన పై ఆర్టీసీ కార్మికులు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా వారితో పార్టీ క్యాడర్ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల బృందం సుమారు 15 గంటలు చర్చించి వారి సమస్యలు పరిష్కారం చేసి సమ్మె విరమింప చేశారన్నారు.  ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ కి ప్రభుత్వం అంగీకరించిందని అందులో ఆర్టీసీ విలీనం చేయడానికి అంగీకరించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం లో 55 రోజుల సమ్మె చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.. 30 మందికి పైగా మరణించారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేద ప్రజలు విద్య వైద్యం ,ఉపాధి అవకాశాలు కోసం ఆర్టీసీ లైఫ్ లైన్ లాగా పని చేస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల అంశాలపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కూడా వారితో కలిసి సంబరాలు నిర్వహించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *