TRS నాకు రాసిపెట్టి ఉందేమో:కవిత

Spread the love

మాజీ ఎంపీ కవిత ఇటీవలే కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీని కవిత ప్రకటించారు. కాగా, ఆమె పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్లు స్వయంగా ఆమె నేడు ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.  సమస్త తెలంగాణ సమాజానికి ఈ విషయాన్ని తెలుపుతున్నాను. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని ముందుకు తీసుకెళ్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని కవిత పేర్కొన్నారు. జనవరి 2026 లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.  అందులో మూడవ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరును కేంద్ర ఎన్నికల సంఘం  ఆమోదించడం కేవలం యాదృచ్ఛికమని TRS నాకు రాసిపెట్టి ఉందేమో అంటూ కవిత సోషల్ మీడియాలో తన పోస్ట్ లో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *