ప్రభాస్… ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో ప్రభాస్ కి ఉన్నంత క్రేజ్ ఎవ్వరికి లేదు… ఎందుకు అంటే, ఆయన లైనప్ చూస్తుంటే అదిరిపోతోంది. ఒక పక్క సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ఇంకో పక్క నాగ్ అశ్విన్ కల్కి 2, సలార్ -2, హను రాఘవపూడి FAUJI ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ‘ది రాజా సాబ్’ తో ప్రేక్షకులను పలరించారు. ఇక సలార్ -2 మొదటి భాగం భారీ విజయాన్ని అందుకున్న తర్వాత రెండో భాగంపై అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా నిర్మాత విజయ్ కిరగందూర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ‘‘సలార్ 2 అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీని అప్‌డేట్స్ కోసం వరుసగా అభిమానులు పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. అవి మా దృష్టికి కూడా వచ్చాయి. త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ విషయం మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు. అలానే డైరెక్టర్ ప్రశాంత్ గురించి మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరని కొనియాడారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే సలార్ 2పై పని మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి సలార్ 2 విషయంలో నిర్మాతలు అభయం ఇచ్చారు. దీంతో సలార్ 2 మరింత భారీ స్థాయిలో ప్రారంభమవుతుందని అభిమానులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.